ఉదయం లేదా రాత్రి.. స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా
ప్రతిరోజూ స్నానం చేయడం అందరికీ అలవాటు. మంచి ఆరోగ్యానికి రోజు స్నానం చేయడం చాలా అవసరం. స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా రిఫ్రెష్ చేస్తుంది. భారతదేశంలో చాలామంది ఉదయం స్నానం చేస్తారు. అదే చైనా, జపాన్, కొరియా వంటి దేశాల ప్రజలు రాత్రిపూట స్నానాలు చేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయం లేదా సాయంత్రం స్నానం ఎప్పుడు చేస్తే మంచిది?
సైన్స్ ఏం చెబుతుంది? ఆయుర్వేదం ఏం చెబుతుంది? జపాన్లో చాలామంది సాయంత్రం రాత్రి స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ రాత్రి స్నానం చేయడం పురాతన సంప్రదాయంగా పాటిస్తూ ఉంటారు. రాత్రిపూట స్నానం చేయడం వల్ల పగటిపూట శరీరంపై పేరుకుపోయిన విష వ్యర్థాలు మురికి తొలగిపోతుందని నమ్ముతారు. దక్షిణ కొరియాలో కూడా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ప్రజలు రాత్రిపూట స్నానం చేస్తుంటారు. కానీ అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాల్లో మాత్రం ప్రజలు ఎక్కువగా ఉదయం పూట స్నానం చేస్తారు. చైనీస్ సంస్కృతిలో కూడా ప్రజలు రాత్రిపూట స్నానం చేస్తూ ఉంటారు. రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని చైనీయులు నమ్ముతారు. ఇది ఉత్తుడిని తగ్గిస్తుంది. చైనా వాతావరణం తేమగా ఉష్ణమండలంగా ఉండటం వల్ల కూడా ఒక కారణం. అందుకే అక్కడి జనాలకు బాగా చెమటలు పడుతాయి. దీనివల్ల వారికి అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయి. అందుకే వారు రాత్రిపూట స్నానం చేస్తారు. సైన్స్ ప్రకారం రాత్రిపూట స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది. రాత్రి స్నానం చేయడం వల్ల పగటిపూట కలిగే ఆలస్యత నిమిషాల్లో మాయమవుతుంది. బాగా నిద్రపడుతుంది కూడా. అందుకే చాలామంది ఉదయం పూటనే కాదు రాత్రిపూట కూడా స్నానం చేస్తారు. రాత్రి పడుకునే ముందు వేడినీటిని స్నానం చేయడం వల్ల బాగా నిద్రపడుతుందని పరిశోధనలోనూ తేలింది. అయితే ఉదయం స్నానం కూడా ముఖ్యం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
