కూర్చుంటే 2 బిర్యానీలు ఖతం !! యాంకరమ్మ పాత ఫోటోలు చూసి అందరూ షాక్
థంబ్ నెయిల్ పై బొద్దుగా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మ.. తన వాక్చాతుర్యం, కామెడీ పంచులతో పలు షోలలో అలరిస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా టీవీ షోలతో గడిపేస్తుంది.
ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. బుల్లితెర రాములమ్మా.. యాంకర్ శ్రీముఖి. ఎస్ ! కెరీర్ తొలినాళ్లల్లో ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉండేది. ఆ తర్వాత డైట్, వెయిట్ కంట్రోల్ అంటూ బాగా కష్టపడి ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ అమ్మడు పాత ఫోటోస్ చూస్తుంటే.. ఈమె ఫ్యాన్సే అస్సలు గుర్తుపట్టలేక పోతున్నారు. మే10.. శ్రీముఖి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ మా పరివారం షోలో ఈ యాంకర్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో శ్రీముఖి పాత ఫోటోలను స్క్రీన్ పై చూపించి షాకిచ్చారు. శ్రీముఖి చిన్ననాటి ఫోటోస్ చూపించి ఎవరో గెస్ చేయాలని అన్నారు. ఆ తర్వాత కనిపించే ఈ క్యూట్ నెస్ వెనక కనబడని ఫోటోస్ ఉన్నాయ్ అంటూ స్క్రీన్ పై కొన్ని ఫోటోస్ చూపించాడు హరి. అందులో శ్రీముఖి ఫోటోస్ చూసి షాకయ్యారు. అందులో శ్రీముఖి ఎవరూ గుర్తుపట్టలేనంత బొద్దుగా ఉంది. ఇది నిజంగా శ్రీముఖి ఫోటోయేనా అంటూ యాంకర్ లాస్య అడగ్గా.. అసలు విషయం చెప్పేసింది శ్రీముఖి. అది తన 10వ తరగతి ఫోటో అని.. ఆ సమయంలో ఒక్కసారి కూర్చుంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్స్ అయిపోవాలంటూ చెప్పుకొచ్చింది. తిని తిని ఏకంగా 108 కిలోలు పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. దీంతో శ్రీముఖి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
