Actress: ఫేమస్ అయ్యేందుకు పేరు మార్చుకుంది.. నెలకు రూ.30 లక్షలు.. ఇప్పుడు ఇలా..
సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరి ప్రతిభతోపాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. అయితే కొందరు తారలు మాత్రం విలాసవంతమైన పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడానికి తమ పేర్లు మార్చుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే నటి సైతం అలాంటి జాబితాలోకి చెందినవారే.

సినీరంగంలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న తారల గురించి విన్నాం. ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తమ పేర్లు మార్చుకున్నారు. కానీ ఓ నటి మాత్రం ఫేమస్ అయ్యేందుకు పేరు మార్చేసుకుందని మీకు తెలుసా..? అవును.. ఇప్పుడు ఆమె అత్యంత ప్రసిద్ధ భారతీయ టెలివిజన్ నటీమణులలో ఒకరు. 2020లో టైమ్స్ ది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఆమె మరెవరో కాదు.. తన పేరు నియా శర్మ. 1990 సెప్టెంబర్ 17న నేహాగా జన్మించింది. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పేరుతో చాలా మంది నటీమణులు ఉన్నారని తెలిసి తన పేరు మార్చుకుంది. 2010లో స్టార్ ప్లస్‌లో వచ్చిన కాళి – ఏక్ అగ్నిపరీక్షతో తన నటనా రంగ ప్రవేశం చేసింది నియా శర్మ. ఆమె బెహెనీన్‌లో నిషా మెహతా పాత్రను పోషించింది.
2014లో, జీ టీవీలో రవి దూబేతో కలిసి జమై రాజా అనే చిత్రంలో నియా ప్రధాన పాత్రలలో ఒకరిగా నటించింది. 2017లో, విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ట్విస్టెడ్ అనే ఎరోటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఆమె ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆ సిరీస్ రెండు, మూడవ సీజన్లలోనూ కనిపించింది. 2018లో, ఆమె మేరీ దుర్గతో పలాష త్రివేదిగా టెలివిజన్‌లోకి తిరిగి వచ్చింది. 2019లో నాగిన్ 4లోనూ నటించింది. ఇవే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ ఓటీటీలో గెస్ట్ గా వచ్చింది.
ఇప్పుడు నియా శర్మ అత్యంత ధనిక టెలివిజన్ హీరోయిన్లలో ఆమె ఒకరు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.60 కోట్లు. నెలకు రూ.15 లక్షల వరకు సంపాదిస్తుందట. ఎక్కువగా సీరియల్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా సంపాదిస్తుంది. ఇవే కాకుండా ఆమె వద్ద ఆడి క్యూ7, (రూ. 80 లక్షలు), ఆడి ఎ4 (రూ. 47.61 లక్షలు) మరియు వోల్వో ఎక్స్‌సి 90 (రూ. 87.9 లక్షలు) వంటి హై-ఎండ్ కార్లు ఉన్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..




