సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్.. త్వరపడండి ఉల్లాసంగా ఉత్సాహంగా
ఒకప్పుడు సినిమాల్లోకి వెళ్లాలని చూసేవారికి.... ఏం చేయాలో తెలిసేది కాదు. ఎవర్ని కలవాలో తోచేది కాదు. అందుకే ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న వాళ్లు కూడా సినిమా ఫీల్డ్‌లోకి ఎలా వెళ్లాలనేది తెలీక.. సినిమా ఆశలను వదులుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. సినిమాల్లోకి వెళ్లేందుక ఎన్నో అవకాశాలు. మరెన్నో మార్గాలు.
ఇక వీటికి తోడే.. రీసెంట్‌గా దిల్ రాజు కూడా దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. న్యూ ట్యాలెంట్‌ను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిని మొదలెట్టాడు. అందులో భాగంగానే ఫిల్మ్ ఆస్పరెంట్సకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అదే సమయంలో ఎందరో హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇప్పుడు మరోసారి కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు. ఈ మేరకు ఔత్సాహిక నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్ ఏర్పాటు చేశారు దిల్ రాజు. ఈ కాస్టింగ్ కాల్‌ను.. ‘దిల్ రాజు డ్రీమ్స్’ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అనౌన్స్ చేశారు దిల్ రాజు.’యాస ఒక్కటే కాదండి.. నరనరాల్లో మన గోదారోళ్ల ఎటకారంతో నిండిపోవాలండీ.. ఆయ్! దీని కోసం మేల్, ఫిమేల్ యాక్టర్స్ కావాలండి. ఏజ్ లిమిట్ లేదు. అనుభవం అవసరం లేదు.. సినిమా పట్ల స్వచ్ఛమైన అభిరుచి చాలు. ఇంకా చూస్తారేంటండీ బాబు.. ఆడిషన్స్‌కి వచ్చేయండి!!. ఆడిషన్స్ ఎక్కడో కాదండి మన రాజమండ్రిలోనే.. అంటూ తన DRD హ్యాండిల్లో పోస్టు చేసింది దిల్ రాజు టీం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

