నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ప్రపంచంలో ఎవరైనా .. తమ ఆస్తిపాస్తులను తమ సంతానానికి లేదా దగ్గరి బంధువులకు రాసిస్తుంటారు. కానీ, చైనాలోని ఈ పెద్దాయన మాత్రం తన తదనంతరం తన పెంపుడు పిల్లిని జాగ్రత్తగా చూసుకునే వారికే తన ఆస్తి చెందుతుందంటూ వీలునామా రాశాడు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ నివాసి అయిన 82 ఏళ్ల లాంగ్ అనే వృద్ధుడు.. పదేళ్ల క్రితమే భార్య కన్నుమూయటం, సంతానం కూడా లేకపోవటంతో ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో ‘జియాన్బా’ అనే పిల్లి పిల్లలను చేరదీసి, కన్నబిడ్డలా సాగుతున్నాడు. అయితే, తన మరణం తర్వాత జియాన్బా భవిష్యత్తు ఏమిటనే ఆందోళనతో దానిని జీవితాంతం కాపాడే నమ్మకమైన వ్యక్తి కోసం లాంగ్ వెతుకుతున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియాతో మాట్లాడిన లాంగ్.. తన పిల్లిని ప్రేమగా చూసుకునే వారికి తన అపార్ట్‌మెంట్‌తో పాటు తన బ్యాంకు అకౌంట్‌లోని పొదుపు మొత్తం కూడా ఇస్తానని ప్రకటించారు. దీంతో, పలువురు జంతు ప్రేమికులు.. లాంగ్ ను సంప్రదించే పనిలో పడ్డారు. నిజానికి.. చైనాలో పెంపుడు జంతువులపై ఇంతగా ప్రేమ కురిపించే వారు తరచూ కనిపిస్తూనే ఉంటారు. నిరుడు.. షాంఘైకి చెందిన ఓ వృద్ధురాలు తన పిల్లలు తనను పట్టించుకోవడం లేదనే కారణంతో, రూ. 24 కోట్ల ఆస్తిని తన పెంపుడు కుక్కలు, పిల్లులకు రాసేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

