ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇంటి నిర్మాణంలో ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యమైన అంశం. మనకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే, ఆ బిల్డింగ్ ప్లానింగ్ కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి ఆర్కిటెక్ట్‌లు, సివిల్ ఇంజనీర్లు, ఇంటీరియర్ డిజైనర్‌ల వంటి నిపుణులు అభిప్రాయాలు అవసరం. మీకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఇంటి నిర్మాణ ప్లాన్ కావాలంటే మాత్రం ఆర్కిటెక్ట్ను సంప్రదించడం బెస్ట్.
ప్లాన్ ప్రకారం నాణ్యంగా నిర్మాణం జరగాలంటే స్ట్రక్చరల్ ఇంజినీర్ పర్యవేక్షణ తప్పనిసరి. ఫీజులకు భయపడి చాలా మంది వీరిని సంప్రదించరు. మేస్త్రీలు, పనులు చేయించే గుత్తేదారుల మీదే చాలా మంది ఆధారపడుతుంటారు. అలాంటప్పుడే అనుభవం లేని వారి కారణంగా పలు తప్పులు దొర్లుతుంటాయి. అయితే బీహార్ రాష్ట్రంలో ఓ ఇంటికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే ఇంటిలాగే ఉంటుంది. ఇంటి పక్కకు వెళ్లి చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. బీహార్‌లోని ఖగడియా జిల్లాలో ఆరడుగుల అతి తక్కువ వెడల్పుతో ఇంటిని నిర్మించారు. ఆ ఇంటిని చూసిన వారు ఇదెలా సాధ్యం అని షాక్‌కు గురవుతున్నారు. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాదిరిగా ఉందని అందులో మనుషులు నివసించడం సాధ్యమేనా? మరెందుకు నిర్మించినట్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది ‘బీహార్.. ఇక్కడ ఏదైనా సాధ్యమే’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంపముంచిన సోషల్ మీడియా పోస్ట్.. రూ.22 లక్షల ప్యాకేజీ జాబ్ గోవిందా
ఆ మాంసం తినేవాడు రాముడిగా ఎలా నటిస్తాడు !! రణ్‌బీర్ పై హిందూ సంఘాల ఆగ్రహం
కొడుకు తప్పుకు.. సారీ చెప్పిన స్టార్ హీరో
మనుషులకే దిక్కులేదంటే.. కుక్కకేమో గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ…!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

