AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచిన సోషల్‌ మీడియా పోస్ట్‌.. రూ.22 లక్షల ప్యాకేజీ జాబ్‌ గోవిందా

కొంపముంచిన సోషల్‌ మీడియా పోస్ట్‌.. రూ.22 లక్షల ప్యాకేజీ జాబ్‌ గోవిందా

Phani CH
|

Updated on: Jul 10, 2025 | 9:07 PM

Share

జాబ్‌ కోసం అప్లై చేసుకున్న ఓ అభ్యర్ధి ప్రతిభకు సంస్థ యాజమాన్యం అబ్బురపడింది. ఆఫర్‌ చేసినదానికంటే ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ చివరి క్షణంలో సోషల్ మీడియా పోస్టులు చూసి, ఆ నియామకాన్ని రద్దు చేసింది సదరు సంస్థ. సోషల్‌ మీడియాలో తను చేసే పోస్టులు, వ్యాఖ్యలు సమాజంపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ ఘటన రుజువు చేసింది.

‘జాబీ’ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అహ్మద్ భాటి ఇటీవల తమ కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసినట్లు లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రతిభకు ముచ్చటేసిందని, తమ బడ్జెట్ కంటే ఎక్కువ జీతం ఇచ్చేందుకు సిద్ధపడ్డామని ఆయన తెలిపారు. అయితే, తుది దశ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో భాగంగా అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, కొన్ని వర్గాలను కించపరిచేలా అభ్యర్థి పెట్టిన పాత కామెంట్లు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. “ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా కావొచ్చు. కానీ మాకు ప్రతిభతో పాటు గౌరవం, ప్రాథమిక విలువలు కూడా అంతే ముఖ్యం. ప్రతిభ మిమ్మల్ని కంపెనీలోకి అడుగుపెట్టేలా చేస్తుంది. కానీ, మీ విలువలు మాత్రమే మీరు ఇక్కడ కొనసాగాలా వద్దా అని నిర్ణయిస్తాయి” అని భాటి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆఫర్ రద్దు చేస్తూ పంపిన లేఖ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. సదరు వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో పెట్టిన కొన్ని పబ్లిక్ కామెంట్లు కొన్ని వర్గాల మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ కారణంగా అతనికి ఇచ్చిన ఉద్యోగ నియామకపు ఆఫర్ ను రద్దు చేస్తున్నామని ఆ లేఖలో భాటి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట చర్చకు దారితీసింది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫౌండర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, కంపెనీ సంస్కృతికి విలువలు చాలా అవసరమని అంటుండగా, మరికొందరు ఇది ‘క్యాన్సిల్ కల్చర్’ అని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఉద్యోగ ఆఫర్‌ను రద్దు చేయడం నాయకత్వపు అపరిపక్వతకు నిదర్శనమని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన, వృత్తి జీవితంపై సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ మాంసం తినేవాడు రాముడిగా ఎలా నటిస్తాడు !! రణ్‌బీర్ పై హిందూ సంఘాల ఆగ్రహం

కొడుకు తప్పుకు.. సారీ చెప్పిన స్టార్ హీరో

మనుషులకే దిక్కులేదంటే.. కుక్కకేమో గ్రాండ్‌గా బర్త్‌ డే పార్టీ…!

నాలుగో పెళ్లాం వచ్చిన వేళా విశేషం.. లాటరీ గెలిచిన నటుడు…

మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా.. !