ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమ పేరుతో ఓ ఉన్మాది దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరులో తీవ్ర కలకలం రేపింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి, రక్తపు మడుగులో పడివున్న ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకుని పైశాచికంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
పాండవపురానికి చెందిన ఓ యువతిని అభిషేక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆమెను కలిసి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, తన జోలికి రావద్దని గట్టిగా హెచ్చరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అభిషేక్, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో యువతి స్పృహతప్పి కిందపడిపోగా, అంతటితో ఆగని ఆ ఉన్మాది.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమె మెడలో తాళి కట్టి, ఓ సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం అతడే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు అభిషేక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

