AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్

చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్

Phani CH
|

Updated on: Jul 11, 2025 | 7:37 PM

Share

చిన్న తప్పు... పెద్ద ముప్పునే దారితీయొచ్చనేది తెలుగులో ఉన్న సామెత. ఇప్పుడు ఈ సామెతే మరోసారి నిజం అయింది. టాలీవుడ్ స్టార్స్‌ సెలబ్రిటీలు చేసిన చిన్న తప్పే... ఈడీ అధికారలుకు పెద్ద లీడ్‌గా మారింది. ఫలింతగా తీగ లాగితే డొంకంతా కదిలింది. దాంతో పాటే... మన స్టార్స్ సెలబ్రిటీలపై కేసు బుక్కయ్యే వరకు పరిస్థితి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సినీ హీరోలు, హీరోయిన్స్, యాంకర్లు, పలువుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక బెట్టింటి యాప్స్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవర కొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ప్రణిత, విష్ణు ప్రియలతో పాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వీరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం తీసుకున్న డబ్బు ఐటీ రిటర్న్స్ లో లేవని అధికారులు గురించారు. ఆ డబ్బుకు సంబంధించి సరైన లెక్కలు లేనందున వారిపై మనీ లాండరింగ్‌ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ విషయంలో గతంలో పలువురు సెలబ్రెటీలు విచారించారు అధికారులు. కొంతమందికి నోటీసులు పంపారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ, రానా టీమ్ లు స్పందించాయి. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, స్కిల్ డెవలప్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశారు అని విజయ్ దేవరకొండ టీమ్ తెలిపింది. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశామని విజయ్, రానా టీమ్స్ తెలిపాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో తాము కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముగిసిపోయిందని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తాను బెట్టింగ్ యాప్ తో కుదుర్చుకున్న డీల్ అయిపోయిందని తెలిపారు. కానీ ఇప్పుడు మరోసారి ఈడీ అధికారులు ఈ కేసుపై దూకుడు పెంచారు. మరి వీరిపై కేసు నమోదు కావడంపై సినీ సెలబ్రెటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్.. త్వరపడండి ఉల్లాసంగా ఉత్సాహంగా

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో