ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల బండారం బట్టబయలు కాబోతోంది. బెట్టింగ్ యాప్ వ్యవహారపై సీరియస్‌గా రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్‌రాజ్, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ.
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ప్రముఖుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లగించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. దీనిపై సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లెటెస్ట్‌గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు..యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీని కోసం వారికి లక్షల్లో, కోట్లల్లో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్‌లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రెటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈజీమనీ వేటలో అనేకమంది బెట్టింగ్‌కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజుకూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక..మరోవైపు సొంతవారికి ముఖం చూపించ లేక..బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్.. త్వరపడండి ఉల్లాసంగా ఉత్సాహంగా
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్అప్స్.. అక్కడ నుండి..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?

