హీరోయిన్ దారుణ హత్య.. 17 సార్లు ఛాతీలో పొడిచి చంపిన డ్రైవర్.. 23 ఏళ్లకే తీరని విషాదం..
ఒకప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ 23 ఏళ్ల వయసులోనే ఆమె దారుణ హత్యకు గురైంది. ఆమె మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికీ ఆమె జనాల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసిన ఆమె.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 20 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె.. దాదాపు 60 చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన డ్రైవర్, వంటమనిషి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు రాణి పద్మిని. 1962లో చెన్నైలో జన్మించింది. ఆమె తల్లి ఇంద్ర కుమారి సినిమా రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్. దీంతో చిన్నప్పటి నుంచే తన కూతురికి శాస్త్రీయ నృత్యం నేర్పించింది. తన కూతురిని సినిమాల్లో నటిగా మార్చాలని ముంబై తీసుకెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
1981లో మలయాళ చిత్రం విలంగుం వీణయం సినిమాలో చిన్న పాత్రతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమెకు మలయాళంలో వరుస అవకాశాలు అందుకుంది. అప్పట్లో ఆమె మమ్ముట్టి, మోహన్ లాల్, కార్తీ, మైక్ మోహన్, రాజ్ కుమార్ వంటి స్టార్ నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసింది. అప్పట్లోనే తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 60 కి పైగా చిత్రాలలో నటించింది. అప్పట్లో చెన్నైలోని అన్నానగర్‌లో 6 గదుల బంగ్లాను కొని తన తల్లి ఇంద్రకుమారితో నివసించింది. తన ఇంటికి వంటమనిషి, డ్రైవర్, వాచ్ మెన్ అవసరమని వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చారు.వెంటనే జాకబ్ జెబరాజ్ అనే వ్యక్తి డ్రైవర్ గా చేరాడు. ఆ తర్వాత గణేశన్, లక్మీ నారాయణన్ అనే వ్యక్తులు సైతం ఇంట్లో పని కుదుర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఒకసారి సినిమా షూటింగ్ ముగించుకుని వస్తుండగా.. తన డ్రైవర్ తప్పుగా చూసినందుకు ఆమె అతడిని చెంపదెబ్బ కొట్టి ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న జెబరాజ్.. ఆ ఇంట్లో పనిచేస్తున్న వంటమనిషి, వాచ్ మెన్ ఇద్దరితో కలిసి ఆమె ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారు. ఒకరోజు రాత్రి పద్మిణి ఇంట్లో దొంగతనం చేస్తుండగా.. ఆమె తల్లి ఇందిరా కుమారి వారిని చూసింది. దీంతో జెబరాజ్ అనే వ్యక్తి వెంట తెచ్చుకున్న కత్తితో ఇందిరా కుమారిని పొడిచి చంపేశాడు. తన తల్లి కేకలు విని పరుగెత్తుకుంటూ వచ్చిన నటి రాణి పద్మినిని కూడా పొడిచి చంపాడు. రాణి పద్మిని ఛాతీపై 17 సార్లు కత్తితో పొడిచి చంపారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హంతకులు పారిపోయారు. వారిద్దరూ మరణించిన నాలుగు రోజులకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి హత్య ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?




