Actress : రూ.4 కోట్లతో తీస్తే రూ.110 కోట్ల కలెక్షన్స్.. 13 ఏళ్లకే హీరోయిన్గా సెన్సేషన్.. ఈ బ్యూటీ గురించి తెలిస్తే..
పదమూడేళ్ల వయసులోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కథానాయికగా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఫస్ట్ మూవీతోనే రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. నటీనటులు కాకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిన్న సినిమాలు సత్తా చాటతున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం 2016లో సంచలనంగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డ్స్ కొల్లగొట్టింది. అందులో కనిపించిన నటి 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.ఇంతకీ ఆమె తెలుసా.. ? అలాగే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు సైరత్.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
2016లో మరాఠీలో విడుదలైన ఈ మూవీ మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ధడక్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. కానీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సైరత్ సినిమాలో ఆర్చీ పాటిల్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ రింకు రాజ్ గురు. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. సైరత్ సినిమా రింకుకు మొదటి చిత్రం. అప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమా చేస్తున్న సమయంలో రింకు 7వ తరగతి చదువుకుంటుంది. ఆమెను మొదటి సారి చూసిన డైరెక్టర్ సరిగ్గా ఏడాదికి సైరత్ సినిమాను తెరకెక్కించారు. చిన్న వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసి అద్భుతమైన నటనతో కట్టిపడేసింది రింకు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
2025 మార్చిలో ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయగా.. అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. ప్రస్తుతం రింకు రాజ్ గురు మరాఠీలో వరుస సినిమాలు చేస్తుంది. గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రసంసుల అందుకుంటుంది. ఇటీవలే ఆశా అనే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..




