AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: శ్రుతి హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. చేసింది రెండు సినిమాలే.. ఇప్పుడు 2 వేల కోట్లకు అధిపతి..

కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషలలో పలు ప్రేమకథలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు హిందీలోనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా పరిచయం చేసిన ఓ కుర్రాడు వ్యాపారరంగంలో సత్తా చాటుతున్నారు.

Actor: శ్రుతి హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. చేసింది రెండు సినిమాలే.. ఇప్పుడు 2 వేల కోట్లకు అధిపతి..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2025 | 5:52 PM

Share

భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన నటుడు కమ్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఒకప్పుడు నటుడిగా అలరించిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రేమకథ చిత్రాలను రూపొందించి డైరెక్టర్ గానూ సక్సెస్ అయ్యారు. అయితే ఆయన తెరకెక్కించిన ఓ ప్రేమకథ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందులో నటించిన ఓ హీరో.. ఇప్పుడు వ్యాపారరంగంలో సత్తా చాటుతున్నారు. హీరోగా అతడు చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ.. అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు అతడు 8500 కోట్ల విలువైన వ్యాపారాన్ని నడుపుతున్నారు. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.2164 కోట్లకు పైగానే ఉంటాయి. మనం మాట్లాడుకుంటున్న హీరో పేరు గిరీష్ కుమార్.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

2013లో హిందీలో ప్రభుదేవా దర్శకత్వం వహించిన రామయ్య వస్తావయ్య చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2016లో మరో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. దాదాపు పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న గిరీష్.. అటు బిజినెస్ లో దూసుకుపోతున్నారు. గిరిష్ తండ్రి కుమార్ ఎస్. తౌరానీ. బాలీవుడ్ సినిమా సీనియర్ నిర్మాత. అలాగే బాలీవుడ్ సంగీత సామ్రాజ్యాన్ని నిశ్శబ్దంగా శాసించే టిప్స్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని కూడా. సినిమాలు మానేసిన తర్వాత గిరీష్ ఈ కంపెనీకి సీఓవోగా బాధ్యతలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ప్రస్తుతం టిప్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మార్కెట్ విలువ రూ.8533 కోట్లు. ఇందులో అత్యధిక వాటా గిరిష్ పేరు మీద ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోల కంటే గిరీష్ నెట్ వర్త్ ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..