AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఒకే కుటుంబంలో నలుగురు హీరోయిన్లు.. ఇండస్ట్రీని శాసిస్తున్న ముద్దుగుమ్మలు.. ఎవరంటే.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నవారిలో నలుగురు ముద్దుగుమ్మలు ఒకే కుటుంబానికి చెందినవారని మీకు తెలుసా.. ? ఇప్పుడు అందులో ఒకరు బాలీవుడ్, హాలీవుడ్ లను ఏలేస్తుండగా.. మిగతా ముగ్గురు మాత్రం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందామా.

Cinema : ఒకే కుటుంబంలో నలుగురు హీరోయిన్లు.. ఇండస్ట్రీని శాసిస్తున్న ముద్దుగుమ్మలు.. ఎవరంటే.
Heroines
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2025 | 11:49 AM

Share

నిజానికి సీనిరంగంలో బంధుప్రీతి, ఒకే ఫ్యామిలీ ఆధిపత్యం గురించి చాలా రకాల కామెంట్స్ వింటుంటాం.సినీపరిశ్రమలో నెపోటిజం, బంధుప్రీతి పై ఇప్పటికే చాలా మంది సినీతారలు షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ కిడ్స్ కారణంగా తమకు అవకాశాలు రావడం లేదంటూ వాపోయారు. కానీ మీకు తెలుసా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నలుగురు అక్కచెల్లెల్లు ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. వేర్వేరు సమయాల్లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నలుగురు అక్కచెల్లెల్లు ఇప్పుడు తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇంతకీ వారంతా ఎవరో తెలుసుకుందామా.

అందులో ఒకరు ప్రియాంక చోప్రా. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన ఈ అమ్మడు.. 2002లో విజయ్ దళపతి నటించిన తమిళన్ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2003లో ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై అనే సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నటిస్తుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇవి కూడా చదవండి

ఇక ప్రియాంక సోదరి మీరా చోప్రా సైతం సినిమాల్లో స్టార్. తెలుగులో ఎక్కువగా నటించింది. 2005లో ఎస్.జె. సూర్య నటించిన ‘అన్బే ఆరుయిరే’ చిత్రంతో ఆమె తమిళంలో నటిగా అరంగేట్రం చేసింది. కానీ మీరాకు దక్షిణాదిలో అంతగా గుర్తింపు రాలేదు. గతేడాది రక్షిత్ కేజ్రీవాల్ ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా. లేడీస్ వర్సెస్ రికీ బహల్ సినిమాతో 2011లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంబీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది.

ఇక ప్రియాంక చోప్రా మూడవ సోదరి మన్నారా చోప్రా. జీత్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ సినిమా అంతగా గుర్తింపు రాలేదు. మన్నారా చోప్రాకు అంతగా అవకాశాలు రాలేదు. ఇటీవలే బిగ్ బాస్ 17లో పాల్గొంది.

Priyanka Chopra, Meera Chop

Priyanka Chopra, Meera Chop

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..