Tollywood: చెల్లి పాన్ ఇండియా హీరోయిన్.. అక్క ఆర్మీ ఆఫీసర్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ప్రస్తుతం సినీరంగంలో చెల్లెలు టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మరోవైపు అక్క మాత్రం ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసింది. ఇంతకీ ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు ఎవరో తెలుసా.. ? తెలుగు, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇప్పుడు పాన్ ఇండియా కథానాయికగా అలరిస్తుంది. ఓవైపు చెల్లెలు సినిమాల్లో నటిగా రాణిస్తుంటే.. అక్క మాత్రం ఆర్మీలో చేసి దేశానికి సేవలు అందించింది. ఇంతకీ ఈ ఇద్దరు అక్కచెల్లెల్లు ఎవరో తెలుసుకుందామా. తనే హీరోయిన్ దిశా పటానీ. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
హిందీలో ఎంఎస్ ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాఘీ 2, భారత్ రాధే, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కానీ మీకు తెలుసా..దిశా పటానీ అక్క ఆర్మీ ఆఫీసర్. ఆమె పేరు ఖుష్బూ పటానీ. ఎప్పుడూ నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంది. ఆర్మీలో కొన్నాళ్లపాటు సేవలు అందించిన ఖుష్బూ రిటైల్ అయ్యింది. నవంబర్ 1991న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన ఖుష్బూ పటాని బిబిఎల్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆపై ఉన్నత విద్య కోసం డిఐటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు.
ఇవి కూడా చదవండి: Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..
View this post on Instagram
కాలేజీ రోజుల్లో ఎన్నో భయంకర సంఘటనలు చూసిన ఖుష్బూ.. భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది.మొదటి ప్రయత్నంలోనే ఎస్ఎస్బీ ప్రవేశంలో ఉత్తీర్ణుత సాధించింది. ఆ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ అయ్యింది. 34 ఏళ్ల వయసుకే మేజర్ గా పదవి అందుకుంది. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత వైద్యురాలిగా, ఫిట్నెస్ కోచ్ గా పనిచేస్తుంది. ఆమె టారో కార్డ్ రీడర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా.
View this post on Instagram
Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..







