Mahesh Babu: సొంతంగా విమానంతోపాటు.. లగ్జరీ వ్యానిటీ వ్యాన్ వరకు.. మహేష్ ఆస్తులు తెలిస్తే షాకవుతారు.. మరీ అంత తక్కువా ?.
మురారి, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలతో హిట్స్ అందుకున్న మహేష్.. అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇటు వెండితెరపై హీరోనే కాకుండా నిజ జీవితంలోనూ మహేష్ హీరోనే. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు మహేష్. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆయన ఒకరు. అంతేకాకుండా..
గుంటూరు కారం సినిమాతో మరోసారి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. దివంగత హీరో కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసిన మహేష్.. ఇప్పటివరకు 25 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించాడు. బాలనటుడిగా అడుగుపెట్టి..ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మురారి, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలతో హిట్స్ అందుకున్న మహేష్.. అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇటు వెండితెరపై హీరోనే కాకుండా నిజ జీవితంలోనూ మహేష్ హీరోనే. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు మహేష్. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆయన ఒకరు. అంతేకాకుండా.. జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉన్నాడు. అలాగే హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్, ఏఎమ్బీ సినిమాస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. రెయిన్ బో ఆసుపత్రులకు గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు.
సీఎన్బీసీ నివేదిక ప్రకారం.. మహేష్ ఆస్తుల విలువ రూ. 273 కోట్లుగా అంచనా వేయబడింది. అలాగే నెలకు రూ. 2 కోట్లు.. సంవత్సరానికి రూ. 240 కోట్లు వరకు సంపాదిస్తాడని తెలుస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం.. గుంటూరు కారం సినిమాకు మహేష్ రూ.78 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అలాగే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేసే సినిమాకు దాదాపు రూ. 125 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదిస్తున్నారు. ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ. 10 కోట్లు వసూలు చేస్తాడని తెలుస్తోంది. 2022లో మహేష్ నికర విలువ రూ. 220 కోట్లు. 2015లో కేవలం 90 కోట్లు మాత్రమే అని సమాచారం.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం ఉంది. ఆ ఇంటి విలువ రూ. 28 కోట్లు. అలాగే బెంగుళూరులోనూ ఒక విలాసవంతమైన భవనం ఉంది. మహేష్ బాబుకు కార్లంటే అమితమైన ఇష్టం. చిన్న వయసు నుంచి అతడి గ్యారేజీలో అనేక కార్లను చేర్చుకున్నారు. ఆడి ఇ-ట్రాన్, రేంజ్ రోవర్, BMW X6, Mercedes -Benz S-క్లాస్ వంటి విలాసవంతమైన మోడల్‌లు ఉన్నాయి. మహేష్ బాబు ఇటీవల లెక్సస్ ఎల్ఎక్స్ 570ని కూడా కొనుగోలు చేశారు. అలాగే ప్రైవేట్ విమానం, విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ ఉంది. ప్రొడక్షన్ హౌస్, మల్టీప్లెక్స్, ఏఎన్ రెస్టారెంట్ కూడా ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.