AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘అప్పుడు నా ఇష్టాయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను’.. సమంత సంచలన కామెంట్స్..

కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటీ అటు యాడ్స్, మూవీ ప్రమోషన్స్‏లో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది సామ్. ఈ క్రమంలో తాజాగా తన మనసులోని మాటలు భయటపెట్టింది.

Samantha: 'అప్పుడు నా ఇష్టాయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను'.. సమంత సంచలన కామెంట్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2024 | 11:37 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఖుషి మూవీ తర్వాత ఆమె తన ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుంది. కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటీ అటు యాడ్స్, మూవీ ప్రమోషన్స్‏లో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది సామ్. ఈ క్రమంలో తాజాగా తన మనసులోని మాటలు భయటపెట్టింది. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటీ అనే విషయాన్ని చెప్పుకొచ్చింది సామ్.

ఇటీవల బ్రాడ్ కాస్ట్ ఛానల్‏లో అభిమానులతో ముచ్చటించిన సామ్.. తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటీ ? అని అడగ్గా.. “బహుశా జీవితంలో చేసిన తప్పు ఏంటంటే.. నా సొంత ఇష్టాలను, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడూ ప్రభావితమయ్యాను. అత్యంత క్లిష్ట సమయాల్లో నేను నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఉందని నేను గుర్చించినప్పుడు అది నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా విలువైనది అని గ్రహించాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ స్క్రీన్ షార్ తీసి షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

సమంత ఈ కామెంట్స్ తన మాజీ భర్త గురించి మాట్లాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తనను తాను తెలుసుకోవడానికి ఆమె వైవాహిక బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. సామ్.. నాగచైతన్య ఇద్దరూ కలిసి ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరు 2017లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డివోర్స్ ప్రకటన అనంతరం.. ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అయ్యారు.

Samantha’s Broadcast Channel byu/Ok_Life_1511 inBollyBlindsNGossip

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.