Cinema: 25 రోజుల్లోనే రూ.177 కోట్ల కలెక్షన్స్.. ఆ ఒక్క సంఘటనతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా..
భారతదేశంలోనే అత్యంత విషాదకరమైన సంఘటనలను హైలెట్ చేస్తూ రూపొందించిన సినిమా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ సినిమా ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఇంతకీ ఇప్పుడం మేం చెబుతున్న సినిమా ఏంటో తెలుసా.. ?

గత కొన్నేళ్లుగా సినీరంగంలో మలయాళీ చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కంటెంట్ ప్రాధాన్యత ఉండి.. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. ఒక మలయాళ చిత్రం 2023లో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 26 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం విడుదలైన వెంటనే హిట్ అయింది. కేవలం 25 నుండి 30 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 177 కోట్లు సంపాదించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అధికారిక ఎంట్రీని కూడా పొందింది. 2018లో కేరళలో సంభవించిన వినాశకరమైన వరదల కథ ఆధారంగా రూపొందించబడింది. బడ్జెట్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ సంపాదించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక ముద్ర వేసింది.
ఆ సినిమా పేరు 2018. ఈ సినిమా భారతదేశ ప్రత్యేక జ్యూరీ అనేక బాలీవుడ్ సినిమాలను కాదని 96వ ఆస్కార్ అవార్డు కోసం ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. 2002లో ఆమిర్ ఖాన్ చిత్రం లగాన్ తర్వాత, ఆస్కార్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఎంట్రీ పొందిన మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. తరువాత, దీనిని హిందీలో కూడా డబ్ చేశారు. కేరళలో వచ్చిన భయంకరమైన వరదల కథాంశాన్ని ఈ చిత్రంలో చూపించారు.
ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, నారాయణ్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ సమయంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఈ సినిమాను పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. దీంతో చాలా కాలంపాటు ఈ సినిమా ఆగిపోయింది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..




