హ్యాట్సాఫ్! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్..
కొందరు హీరోలు, హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇతర రంగాల్లోనూ రాణిస్తుంటారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇప్పుడు కార్ రేసింగుల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాడు. ఇప్పుడు అజిత్‌లాగే.. హీరోయిన్ సయామీ ఖేర్ కూడా రేసింగ్‌లో దూసుకుపోతున్నారు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆమె విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్ పోటీల్లో పాల్గొంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏకంగా ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించారు. అటు సినిమాలు, సిరీస్లు చూస్తూనే… వీలు దొరికనప్పుడల్లా… ట్రయథ్లాన్‌లో పాల్గొంటున్నారు సయామీ. అలా ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఐరన్‌మ్యాన్ 70.3 మారథాన్ ను పూర్తి చేశారు. ఈ ఫీట్ అఛీవ్ చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డు క్రియేట్ చేశారు ఈమె. గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకున్నారు. ఇక ట్రయథ్లాన్ పేరుకు తగ్గట్టుగానే ఈ పోటీలో మూడు రేసులుంటాయి. 1.9 కి.మీ. స్విమ్మింగ్, 90 కి.మీ. సైక్లింగ్, 21.1 కి.మీ. పరుగు ట్రయథ్లాన్‌లో భాగం. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి. అందుకే శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉన్నవారే ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్‌లో తొలిసారి ఈ ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన సయామీ.. తాజాగా జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో తన రెండో ఐరన్ మ్యాన్ 70.3ను ట్రయథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాదు తొలిసారి కంటే రెండోసారి 32 నిమిషాల ముందే ఈ రేస్ పూర్తి చేసింది. నయా రికార్డ్‌ను నెలకొల్సింది. 2015లో తెలుగు చిత్రం రేయ్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది సయామీఖేర్. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ గా నటించాడు. దీని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించింది. ఇక 2021లో నాగార్జున అక్కినేనితో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో NIA ఏజెంట్‌గా నటించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం జాట్‌లో కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. రూ.5 కోట్లకు నోటీస్ !!
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. అట్లనే.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

