నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. రూ.5 కోట్లకు నోటీస్ !!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు బిగ్ ఝలక్ తగిలింది. అదేంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నయనతార డాక్యుమెంటరీపై నటుడు ధనుష్ అప్పట్లో కోర్టు మెట్లెక్కాడు.. తన సినిమాలోని సీన్స్ వాడుకున్నందుకు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఇప్పుడా మూవీ ప్రొడ్యూసర్ ధనుస్‌కు తోడు.. అదే డాక్యుమెంటరీపై మరో నిర్మాణ సంస్థ ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది.
నయనతార జీవితం గురించి తెరకెక్కిన డాక్యుమెంటరీ కొన్ని నెలల క్రితం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దీనికి రెస్పాన్స్ ఎలా ఉందని సంగతి పక్కన పెడితే.. ఈ డాక్యుమెంటరీపై అనేక వివాదాలు తలెత్తాయి. గతంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ డా’ సినిమాలో నయనతార నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అందుకే ఆ సినిమా షూటింగ్ లోని కొన్ని సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీంతో ఈ సినిమాను నిర్మించిన ధనుష్ నయనతారకు భారీ మొత్తంలో పరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపాడు. ఈ క్రమంలోనే తమ సినిమాలోని కొన్ని సీన్లను కూడా ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారని.. చూపిస్తూ.. ఇప్పుడు చంద్రముఖి నిర్మాణ సంస్థ ఐదు కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తూ డాక్యుమెంటరీ నిర్మాతలతో పాటు నయన్‌కు నోటీసులు పంపింది. ‘నయనతార’ డాక్యుమెంటరీలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. దీంతో ఈ సినిమా హక్కులను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్స్ ఇప్పుడు నయనతారకు నోటీసు పంపింది. తమ అనుమతి లేకుండా సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించడం ద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వారు ఆరోపించారు. ధనుష్ నిర్మాణ సంస్థ నయనతారపై ఫిర్యాదు చేసినప్పుడు, ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ధనుష్ పై ఘాటైన విమర్శలు చేసింది. మరి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. అట్లనే.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్.. త్వరపడండి ఉల్లాసంగా ఉత్సాహంగా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

