AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మూలాలు మర్చిపోని పాన్ ఇండియా యాక్టర్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీలు అమ్ముతూ.. ఎవరో తెలుసా?

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదంటారు పెద్దలు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న ఈ ఫేమస్ నటుడు ఇప్పటికీ ఇడ్లీ కొట్టును రన్ చేస్తున్నాడు. ఒక సామాన్యుడిలా రోడ్డుపై నిలబడి ఇడ్లీలు అమ్ముతుంటాడు.

Tollywood: మూలాలు మర్చిపోని పాన్ ఇండియా యాక్టర్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీలు అమ్ముతూ.. ఎవరో తెలుసా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 30, 2025 | 6:49 PM

Share

ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తోన్న వారిలో చాలా మంది చిన్న తనంలో, టీనేజ్ లో ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్టకూటికోసం రకరకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ పాన్ ఇండియా నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తండ్రి చనిపోయినా, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా, స్నేహితులు, బంధువులు వద్దంటున్నా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎప్పుడు ఎక్కడ ఆడిషన్ జరిగినా వెళ్లాడు. తన ట్యాలెంట్ చూపించాడు. చిన్న రోల్స్ అయినా ఏ మాత్రం భేషజాలు లేకుండా నటించాడు. ఇంకా మంచి అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పలరిగేలా ఎన్నో ఏళ్ల పాటు తిరిగాడు. సీరియల్స్, టీవీ షోలు, సినిమాలు ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా నో చెప్పకుండా నటించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తోంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ విలన్ వెంకటేష్.

కేరళకు చెందిన వెంకటేశ్ ఓ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అయితే అంతకు ముందు బతుకు తెరువు కోసం.. త్రివేంద్రంలో రోడ్ సైడ్ ఓ ఇడ్లీ స్టాల్ నిర్వహించాడు. ప్రత్యేకించి ఇడ్లీలకే ఆ కొట్టు బాగా ఫేమస్. అక్కడ రకరకాల వెరైటీ ఇడ్లీలు దొరుకుతాయి. ‘సుడా సుడా ఇడ్లీ’ (వేడి వేడి ఇడ్లీ) అంటూ వెంకటేష్ చేసిన ఒక రీల్ తో ఈ ఇడ్లీ బండి బాగా ఫేమస్ అయిపోయింది. మలయాళంతో పాటు వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నా తీరిక దొరికినప్పుడల్లా తన ఇడ్లీ కొట్టుకు వెళతాడు వెంకటేష్. సినిమా షూటింగ్స్ లేని టైంలో తన స్టాల్‌లో కస్టమర్లకు ఇడ్లీలు సర్వింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

ఇడ్లీ కొట్టులో కింగ్ డమ్ విలన్..

మోహన్ లాల్ తో నటుడు వెంకటేష్..

View this post on Instagram

A post shared by Venky (@venkitesh_v.p)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్