Intlo Illalu Vantintlo Priyuralu: ఒక్క సినిమాతోనే పాపులర్.. ఆ అనుమానంతో అరెస్ట్ చేసిన పోలీసులు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేశ్, సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ వస్తుందంటే చాలు ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ఫ్యామిలీ డ్రామాలలో ఈ సినిమా స్పెషల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేశ్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, ఫ్యామిలీ అడియన్స్ వెంకీ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు వెంకటేశ్. మాస్ యాక్షన్ హీరోగా మెప్పిస్తూనే అటు కామెడీ టైమింగ్ తోనూ అలరిస్తుంటారు వెంకీ. ఇక ఆయన నటించిన చిత్రాల్లో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. ఈ మూవీలో వెంకీ కామెడీ టైమింగ్, యాక్టింగ్ మాములుగా ఉండదు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో వచ్చిన తైకులమే తైకులమే మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు. ఇందులో సౌందర్యతోపాటు మరో హీరోయిన్ సైతం నటించింది. ఇంతకీ ఆమె గుర్తుందా.. ? అదేనండీ.. నేపాలీ అమ్మాయి మనీషాగా.. వెంకీ రెండో భార్యగా కనిపించింది. ఆమె పేరు వినీత.
తెలుగులో ఈ మూవీతోనే పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. వినీత తన సినీప్రయాణంలో మొత్తం 70కి పైగా సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2003లో వ్యభిచారం అనుమానంతో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ ఆమె ఏ తప్పు చేయలేదని తెలియడంతో 2004లో ఆమెను విడుదల చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వినీత.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తన పేరును కించపరిచేలా పోలీసులు వ్యవహరించారని.. తనపై తప్పుడు కేసులు పెట్టి తన కెరీర్ నాశనం చేశారని అప్పట్లో ఆరోపణలు చేసింది వినీత. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2008లో ఎంగరాసి నల్ల రాసి సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.
ఈ సినిమా తర్వాత వినీత మరో సినిమా చేయలేదు. అలాగే ఇప్పటికీ సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది వినీత. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అప్పట్లో నాజుగ్గా.. ఎంతో అందంగా ఉన్న వినీత ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వినీత గతంలో 1991-92 సంవత్సరానికి మిస్ ఇండియా పోటీలో పాల్గొంది.

Actress Vineetha
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..