Kichcha Sudeep: ‘మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా’.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు.. వీడియో

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఇంట్లో కొన్ని రోజుల క్రితం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్టోబర్ 20న అతని తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. ఈ విషాదం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు సుదీప్.

Kichcha Sudeep: 'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు.. వీడియో
Kichcha Sudeep
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2024 | 7:48 PM

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సినిమా కోసం కిచ్చా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మ్యాక్స్ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా సుదీప్ అండ్ టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సుదీప్ మరోసారి తన తల్లిని గుర్తు చేసుకున్నారు. తన తల్లి ఆఖరి కోరిక తీర్చలేకపోయానంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా ‘మ్యాక్స్’ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సినిమా ముందే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీనిపై స్పందించిన సుదీప్ ఎమోషనల్ అయ్యాడు. తన తల్లి మ్యాక్స్‌ సినిమాను చూడాలని ఉందని చాలా సార్లు తనతో చెప్పిందని, కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె కన్నుమూసిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుదీప్.

‘మా అమ్మ బతికున్నప్పుడు ‘మ్యాక్స్‌’కి సంబంధించిన కొన్ని చిన్న క్లిప్‌లను చూపించాను. అవి చూసి ఆమె చాలా సంబరపడింది. నా సినిమాను చూడాలని చాలా సార్లు చెప్పుకొచ్చింది’ అని సుదీప్ చెప్పుకొచ్చాడు. కాగా సుదీప్ తల్లి సరోజ అక్టోబర్ 20న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడిన ఆమె జయనగర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. కాగా తల్లి మరణం నుంచి సుదీప్ ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఈ విషాదం తర్వాత బిగ్ బాస్ షో నుంచి వారం రోజులు విరామం తీసుకున్నాడు. ఇక ఇదే వేదికపై తన తల్లి గురించి చెబుతూ పలు సార్లు ఎమోషనల్ అయ్యాడు.

కాగా మ్యాక్స్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా గ్రాండ్ గా చేయాలని నిర్మాతలు భావించారట. అయితే దీనికి సుదీప్ అంగీకరించలేదట. ‘ మ్యాక్స్ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ ను భారీగా నిర్వహిద్దామన్నారు నిర్మాతలు. కానీ నేను నో చెప్పాను. కావాలంటే తదపరి ఈవెంట్ భారీగా చేద్దామన్నాను.ఈ సినిమాలో అతని మొదటి టైటిల్ కార్డు మా అమ్మదే. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు’ అని సుదీప్ ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

కిచ్చా సుదీప్ ఎమోషనల్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.