Puri Musings: ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్ లేటెస్ట్
పూరి జగన్నాథ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో మ్యూజింగ్స్‌తో కూడా అదే స్థాయిలో యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. తనదైన శైలిలో పలు అంశాలపై మాట్లాడుతూ అట్రాక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రీప్లేసబుల్ అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. జీవితంలో ఒక మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలని సూచించారు..
దర్శకుడు పూరి జగన్నాథ్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసే పూరీ మ్యూజింగ్‌కు ఎంతో మంది ఫాలోవర్లు ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని రకాల అంశాలను తనదైన శైలిలో ప్రస్తావిస్తుంటారు పూరి. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌పై పూరి మాట్లాడారు. రీప్లేసబుల్ అనే అంశంపై మాట్లాడిన పూరి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవర్, మనీ, సక్సెస్ మన జీవితాతంతం ఉండని తెలిపిన పూరి.. అవి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై పూరీ ఇంకా మాట్లాడుతూ..ఒక వ్యవస్థ, ఒక బంధం ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఎలాంటి నష్టం ఉండదు, అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారని జీవిత సత్యాన్ని చెప్పుకొచ్చారు పూరీ.
ఎన్నో ఏళ్‌లు కష్టపడి పనిచేసిన కంపెనీలో రిటర్మైంట్ రోజు ఎంతో భావోద్వేగానికి గురై సాధించిన విజయాల గురించి ఓ వైపు మాట్లాడుతుంటారు. అయితే అదే సమయంలో మీ యాక్సిస్ కార్డు ఇంకొకకరు డీ యాక్టివేట్ చేస్తుంటారు. మీ అఫీషియల్ మెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌ను మార్చేస్తారు. కాఫీ ఇచ్చే బాయ్ కూడా మీ డెస్క్‌ను ఖాళీ చేసి మీ వస్తువులను కారులో పెట్టేస్తుంటాడు. మీ సహోద్యోగి మిమ్మల్ని మిస్ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతుంటారు. అయితే అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్ అయిపోగానే ఓ పెగ్ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.
ఒకరి స్థానాన్ని మరొరకితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదన్న పూరీ… మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థ మాత్రమే అని చెప్పుకొచ్చారు. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి అని సూచించారు. జీవితంలో పవర్, డబ్బు, విజయం చివరి వరకు ఉండవన్న పూరీ.. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలన్నారు.. ఈ లోకంలో అమ్మ, ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు అని మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..