AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK S4: ‘నేను కూడా ఎమ్మెల్యేనే సార్’.. బాలయ్య షోలో నవీన్, శ్రీలీల హంగామా చూశారా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో రన్ అవుతోన్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ షోకు వచ్చి తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సందడి చేశారు.

Unstoppable with NBK S4: 'నేను కూడా ఎమ్మెల్యేనే సార్'.. బాలయ్య షోలో నవీన్, శ్రీలీల హంగామా చూశారా?
Unstoppable with NBK S4
Basha Shek
|

Updated on: Dec 02, 2024 | 7:15 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ టాక్ షో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, నాలుగు, ఐదో ఎపిసోడ్స్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు.తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో పంచుకున్నారు. ఇక ఆరో ఎపిసోడ్ కు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి ఈ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజైంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ ప్రోమోలో బాలయ్యతో కలిసి నానా హంగామా చేశారు శ్రీలీల, నవీన్ పోలిశెట్టి. ముఖ్యంగా జాతి రత్నాం నవీన్‌ నవ్వులు పంచాడు. ‘బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్‌, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. నేను మెంబర్‌ ఆఫ్‌ లాస్ట్‌ బెంచ్‌ అసోసియేషన్‌’ అంటూ సరికొత్త అర్థం చెప్పాడు. ఇక శ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా .. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్‌ స్టైల్‌లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్.

ఈ సందర్భంగా ఆడిషన్స్‌ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. ఓ చిప్స్‌ కంపెనీ ఆడిషన్‌లో.. నాకు సిక్స్‌ ప్యాక్‌ లేదని రిజెక్ట్‌ చేశారని గుర్తు చేసుకున్నాడు నవీన్. అసలు చిప్స్‌ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్‌ ఎలా వస్తుదని లాజిక్‌ పాయింట్‌ కూడా అడిగాడు. ఇక ప్రోమో చివర్లో ముగ్గురూ కలిసి కిస్సిక్‌ పాటకు స్టెప్పులు కూడా వేశారు. మొత్తానికి ‘ ఫన్ లో అసలు తగ్గద్దేలే’ అన్నట్లు ఈ ఎపి సోడ్ సాగినట్లు తెలుస్తోంది.

బాలయ్య అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో..

బాలయ్య, శ్రీలీల, నవీన్ పొలిశెట్టిల ఫన్ ఫుల్ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 6న ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?