AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rai Death: క్యాన్సర్‏తో పోరాటం.. కేజీఎఫ్ హీరో యష్ చాచా మృతి.. విషాదంలో ఇండస్ట్రీ..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ గురువారం (నవంబర్ 06) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Harish Rai Death: క్యాన్సర్‏తో పోరాటం.. కేజీఎఫ్ హీరో యష్ చాచా మృతి.. విషాదంలో ఇండస్ట్రీ..
Harish Roy
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2025 | 3:54 PM

Share

కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (నవంబర్ 6న) తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఓం’, ‘నల్ల’, ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ వంటి ఇతర చిత్రాలతో పాపులర్ అయ్యారు. కేజీఎఫ్ 2 సినిమా సమయానికే ఆయన క్యాన్సర్ తో బాధపడుతుండగా.. హీరో యష్ సహ చాలా మంది ఆయనకు ఆర్థికంగా సహాయం చేశారు. కానీ చివరకు క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం కన్నుమూశారు హరీష్.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

కేజీఎఫ్ సినిమాలో యష్ ఛాఛా పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేజీఎఫ్ రెండో పార్ట్ రిలీజయ్యే సమయానికి ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడి బలహీనంగా మారి కడుపు పూర్తిగా వాచిపోయింది. థైరాయిడ్ క్యాన్సర్ నాలుగో స్టేజ్ కావడంతో చికిత్స కోసం యశ్, హీరో ధృవ్ సర్జా, నిర్మాత ఉమాపతి శ్రీనివాస్, దర్శన్ అభిమానులు, అనేక మంది నటీనటులు హరీష్ రాయ్‌కు ఆర్థిక సహాయం అందించారు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

90’sలలో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు హరీష్ రాయ్. నిజ జీవితంలోనూ హరీష్ రాయ్ ఒక కేసులో జైలు పాలయ్యాడు. దర్శన్ జైలుకు వెళ్ళినప్పుడు, హరీష్ రాయ్ తన జైలు రోజులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హరీష్ రాయ్ కు భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు. హరీష్ రాయ్ కన్నడలోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించారు.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..