Keerthy Suresh: క్యాస్టింగ్‌ కౌచ్‌పై కీర్తి సంచలన వ్యాఖ్యలు.. సినిమాలు మానేసి జాబ్‌ చేసుకుంటానంటూ..

తాజాగా ఈ  వ్యవహారంపై మహానటి కీర్తి సురేశ్‌ కూడా స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఛాన్సుల కోసం కమిట్మెంట్‌ ఇచ్చే రకం కాదంటూ కీర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

Keerthy Suresh: క్యాస్టింగ్‌ కౌచ్‌పై కీర్తి సంచలన వ్యాఖ్యలు.. సినిమాలు మానేసి జాబ్‌ చేసుకుంటానంటూ..
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2022 | 12:28 PM

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ తారల తళుకులతో పాటు మనకు తెలియని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎప్పటినుంచో ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా తారలు కూడా సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నారు. అయితే తమ చేదు అనుభవాలను పంచుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎప్పుడైతే మీటూ ఉద్యమం తెరపైకి వచ్చిందో చాలామంది తారలు క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. అవకాశాల కోసం తామెంతటి అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నామో ధైర్యంగా బయటపెట్టారు. తాజాగా ఈ  వ్యవహారంపై మహానటి కీర్తి సురేశ్‌ కూడా స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఛాన్సుల కోసం కమిట్మెంట్‌ ఇచ్చే రకం కాదంటూ కీర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఏదైనా  ఉద్యోగం చేసుకుంటా..

‘సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. నాతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, సినిమా తారలు కూడా దీని గురించి నాకు చెప్పారు. అయితే ఇప్పటివరకు నాకెలాంటి వేధింపులు ఎదురుకాలేదు. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందేమో. అందుకే ఇలాంటి సంఘటన నాకు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే అసలు దానికి అంగీకరించను. కావాలంటే సినిమాలు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. అంతేకానీ సినిమా ఛాన్సుల కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు’ అని కీర్తి పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

కాగా మహేష్ సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది కీర్తి. ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తోంది. అలాగే భోళాశంకర్‌ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది. వీటితో పాటు మామన్నన్‌, సైరన్‌ సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే