పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..
సూర్యాపేట జిల్లాకు చెందిన బుడిగె లచ్చయ్య (90), వెంకటమ్మ (80) దంపతులు 65 ఏళ్లు అన్యోన్యంగా జీవించారు. భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే భర్త ప్రాణాలు విడిచారు. మరణంలోనూ కలిసే ప్రయాణం చేసిన ఈ జంట, భారతీయ వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని, ప్రేమ బంధం యొక్క నిజమైన బలాన్ని మరోసారి చాటిచెప్పింది.
భార్యభర్తల బంధం ఎంత బలమైనదో తెలిపే ఘటన ఇది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. వివాహమనే బంధంతో ఒక్కటైన ఆ జంట.. మరణంలోనూ కలిసే ప్రయాణం చేశారు. పెళ్లి మంత్రాలను,ప్రమాణాలను పక్కన పెట్టి అక్రమ సంబంధాలకు వశమై ఒకరినొకరు చంపుకుంటున్న ఈ రోజుల్లో భారతీయ వివాహవ్యవస్థ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పిన ఈ దంపతులు నిజంగా పుణ్య దంపతులే. సూర్యాపేట జిల్లాకు చెందిన ఈ దంపతుల్లో .. భార్య అనారోగ్యంతో చనిపోగా, ఆమె ఎడబాటును భరించలేని ఆ భర్త గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదిలేశాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన బుడిగె లచ్చయ్యకు తొంభై ఏళ్లు. ఆయన భార్య వెంకటమ్మకు 80 ఏళ్లు. సుమారు 65 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఉన్న కొద్దిపాటి భూమిలో వవసాయం చేసుకుంటూ లచ్చయ్య గీతకార్మికుడుగా, వెంకటమ్మ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పదేళ్ల క్రితం చిన్న కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో పెద్ద కొడుకు వద్దే ఉంటున్నారు. ఈ దంపతులు కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భార్య వెంకటమ్మ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో అదేరోజు సాయంత్రం వెంకటమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 65 ఏళ్లుగా కష్టసుఖాలు పంచుకున్న భార్య వియోగాన్ని భరించలేక లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే లచ్చయ్య అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు నిర్వహించారు. ఇరువురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణం కూడా ఈ అన్యోన్య దంపతులను విడదీయలేకపోయిందని స్థానికులు చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!
అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..
శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా
Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. చివరికి ఇలా
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు

