AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!

Phani CH
|

Updated on: Feb 05, 2026 | 7:18 PM

Share

2026 బడ్జెట్ సావరీన్ గోల్డ్ బాండ్ పెట్టుబడిదారులకు షాకిచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుండి, సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేసిన SGBలపై మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను వర్తిస్తుంది. కేవలం RBI నుండి నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకున్న అసలు పెట్టుబడిదారులకు మాత్రమే పన్ను మినహాయింపు కొనసాగుతుంది. ఈ కొత్త నిబంధన చాలా మంది ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తుంది.

బంగారం మీద పెట్టుబడి పెట్టే వారికి ‘సావరీన్ గోల్డ్ బాండ్స్’ ఒక వరం లాంటివి. ఫిజికల్ గోల్డ్ కంటే వీటిలో రిస్క్ తక్కువ, పైగా ఏటా వడ్డీ కూడా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే వచ్చే లాభం మీద ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు. కానీ, తాజాగా కేంద్ర బడ్జెట్‌–2026 సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. గతంలో సావరీన్ గోల్డ్ బాండ్లు అంటే పన్ను లేని లాభాలకు కేరాఫ్ అడ్రస్‌.! కానీ, బడ్జెట్ 2026 తెచ్చిన కొత్త నిబంధన ఈ ‘ట్యాక్స్ ఫ్రీ’ హోదాకు గండి కొట్టింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు ఏంటో చూద్దాం. సావరీన్ గోల్డ్ బాండ్ అకస్మాత్తుగా 10% పడిపోయాయి. దీనికి కారణం 2026 బడ్జెట్‌లో వచ్చిన కొత్త రూల్. గతంలో ఈ బాండ్లను ఆర్‌బీఐ నుంచి నేరుగా కొన్నా లేదా స్టాక్ మార్కెట్లో ఇతరుల నుంచి కొనుగోలు చేసినా.. మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే లాభాలపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, కేంద్ర బడ్జెట్ ఈ వెసులుబాటుకు గండి కొట్టింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలయ్యే ఈ రూల్ ప్రకారం, ఆర్‌బీఐ ప్రాథమిక జారీ సమయంలో నేరుగా సబ్‌స్క్రయిబ్ చేసుకుని, మెచ్యూరిటీ వరకు వాటిని అట్టిపెట్టుకున్న అసలు మదుపర్లకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అలా కాకుండా, స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా సెకండ్ హ్యాండ్ లో బాండ్లు కొన్నవారు, మెచ్యూరిటీ సమయంలో వచ్చే ధర వ్యత్యాసంపై ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ పన్ను ప్రయోజనం కేవలం ఒరిజినల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం కానుంది. చాలామంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో ఇతరులు విక్రయించే పాత గోల్డ్ బాండ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. కేంద్రం నిర్ణయంతో ఇటువంటి ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. వారు మార్కెట్‌లో కొన్న ధరకు మరియు మెచ్యూరిటీ సమయంలో వచ్చే ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇకపై ‘క్యాపిటల్ గెయిన్స్’గా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టం 2025 కింద చేసిన ఈ సవరణల వల్ల, సెకండరీ మార్కెట్ కొనుగోలుదారులు మెచ్యూరిటీ వరకు వేచి ఉన్నా సరే పన్ను చెల్లించక తప్పదు. ఒకవేళ ఆర్‌బీఐ దగ్గర నేరుగా బాండ్లు కొన్న ఒరిజినల్ ఇన్వెస్టర్ అయినప్పటికీ, ఎనిమిదేళ్ల కాలపరిమితి ముగియకముందే వాటిని మార్కెట్‌లో విక్రయిస్తే పన్ను మినహాయింపు వర్తించదు. కేవలం ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయ్యే వరకు బాండ్లను తన వద్దే ఉంచుకున్న వ్యక్తికే ఈ ఆదాయపు పన్ను వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్