Jabardasth Varsha: జబర్దస్త్‌లో అది నిజంగానే జరుగుతుంది.. కామెడీ షో గురించి షాకింగ్ విషయం చెప్పిన వర్ష
ఒకప్పుడు పలు టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది వర్ష. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ కామెడీ షోలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిందో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు టాక్ షోస్, పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే ఈ షోకు క్రేజ్ తగ్గింది కానీ ఒకప్పుడు ఈ షో వచ్చిందంటే అందరూ టీవీ లకు అతుక్కుపోయేవారు. బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించిన జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ అందాల తార. అంతకు ముందు పలు టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ తో మరింత పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ ఇమాన్యుయేల్ తో కలిసి వర్ష చేసిన స్కిట్స్ బాగా పేలాయి. బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాలు పలు టీవీ షోల్లో సందడి చేస్తోంది వర్ష. అలాగే హోస్ట్ గానూ రాణిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది వర్ష. అదేంటంటే.. జబర్దస్త్ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లో కానీ నటీనటులు అప్పుడప్పుడు బాగా ఎమోషనల్ అవుతుంటారు. కన్నీళ్లు పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు టీఆర్పీ రేటింగ్ కోసమే అనుకుంటారు చాలా మంది ఆడియెన్స్. అయితే అదంతా నిజం కాదని, తాము నిజంగానే ఎమోషనల్ అవుతామంటూ చెప్పింది వర్ష
‘ జబర్దస్త్ లోని కమెడియన్స్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు స్పందిస్తారు. ఇక జబర్దస్త్ తదితర టీవీ షోల్లో మేం అప్పుడప్పుడు బాగా ఎమోషనల్ అవుతుంటాం. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. టీఆర్పీ కోసం మేం డ్రామాలు ఆడుతున్నామంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ మేము నిజంగానేభావోద్వేగానికి లోనవుతాం. జబర్దస్త్ లో తోటీ కంటెస్టెంట్స్ అందరూ నాతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. నాకు బాగా సహకరించారు. ఇక నాకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. జబర్దస్త్ వర్ష అంటూ అందరూ ఇచ్చే గుర్తింపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అని చెప్పుకొచ్చింది వర్షం. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా నెట్టింట వైరలవుతున్నాయి.
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




