AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! అలా జరిగితే మీకు డబ్బులు తిరిగి వస్తాయి..?

రైల్వేల ఆర్‌ఏసీ టికెట్‌ నిబంధనలపై పార్లమెంటరీ కమిటీ కీలక సూచన చేసింది. ఆర్‌ఏసీ కింద బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి ఛార్జీ వసూలు చేయడం సరికాదని, షేర్డ్ బెర్త్‌లకు పాక్షిక రీఫండ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని కమిటీ రైల్వేలకు సూచించింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! అలా జరిగితే మీకు డబ్బులు తిరిగి వస్తాయి..?
Trains 5
SN Pasha
|

Updated on: Feb 05, 2026 | 7:15 PM

Share

రైళ్లలో దూరం ప్రయాణించేవారు బెర్త్‌లు రిజర్వేషన్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే పండగలు, సెలవులు ఉన్న సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైమ్‌లో రిజర్వేషన్‌ దొరకడం కష్టం. అయితే రైల్వేలు ఆర్‌ఏసీ (రిజర్వేషన్‌ ఎగైనిస్ట్‌ క్యాన్సిలేషన్‌) కింద రిజర్వేషన్‌ ఇస్తారు. ఒకే బెర్త్‌లో ఇద్దరు ప్రయాణించాలి. ఇలాంటి ఆర్‌ఏసీ కేటగిరి కింద బుక్‌ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీ వసూలు చేస్తుంటారు. అలా చేయడం కరెక్ట్‌ కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.

ఆర్‌ఏసీలోనే ఉండి బోర్డింగ్‌ సమయంలో బెర్త్‌ లభించని ప్రయాణికులకు ఛార్జీలో కొంత మేర తిరిగి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పంక్చువాలిటీ అండ్‌ ట్రావెల్‌ టైమ్‌ ఇన్‌ ట్రైన్‌ ఆపరేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ రైల్వేస్‌ పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ప్రజాపద్దుల కమిటీ పేర్కొంది.

కాగా ప్రస్తుతం ఆర్‌ఏసీ కింద బెర్త్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే కేటగిరి కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్‌ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్యాసింజర్లు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు టికెట్‌లో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. త్వరలోనే రైల్వే అధికారులు దీనిని సంబంధించి విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా అమలు అయితే ఆర్‌ఏసీ రిజర్వేషన్‌ ఉన్నవారికి వారు చెల్లించ మొత్తం కొంత తిరిగి రానుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
అగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
నడకదారిన వెళ్తున్న భక్తులకు తారసపడ్డ పెద్దపులి..
నడకదారిన వెళ్తున్న భక్తులకు తారసపడ్డ పెద్దపులి..