Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. తెలుసుకోవాల్సిన 9 ముఖ్యాంశాలు

26 April, 2026

Subhash

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.

లైసెన్స్ రద్దు:

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు.

నిషేధం:

బ్యాంక్ పనితీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఇది ఖాతాదారులు మరియు సాధారణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని RBI పేర్కొంది.

రద్దుకు కారణం:

పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌కు సంబంధించిన పలు కీలక షరతులను పాటించడంలో పేటీఎం బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.

నిబంధనల ఉల్లంఘన: 

గతంలోనే (మార్చి 2022లో) కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఈ బ్యాంక్‌పై RBI నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

పాత ఆంక్షల కొనసాగింపు:

ఇప్పటికే ఈ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలు, వాలెట్ టాప్-అప్‌లపై ఉన్న ఆంక్షలు ఇప్పుడు లైసెన్స్ రద్దుకు దారితీశాయి.

డిపాజిట్లపై బ్రేక్:

తాజా నిర్ణయంతో కొత్త లేదా పాత కస్టమర్లకు ఎలాంటి ప్రామాణిక బ్యాంకింగ్ సేవలను అందించే అధికారాన్ని పేటీఎం బ్యాంక్ కోల్పోయింది.

సేవలు నిలిపివేత:

ఈ పరిణామం పేటీఎం బ్యాంక్ ఖాతాదారులు, వాలెట్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

కస్టమర్లపై ప్రభావం: