AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రతీఒక్కరికీ..

ఈపీఎఫ్‌వో ఖాతాాదారులకు శుభవార్త. త్వరలోనే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. వడ్డీని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అందించేందుకు సిద్దమవుతోంది. ఇటీవల వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. కేంద్ర ఆర్ధికశాఖ నుంచి ఆమోదం వచ్చాక వడ్డీని క్రెడిట్ చేయనుంది. దీంతో వీటి కోసం ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రతీఒక్కరికీ..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Apr 29, 2026 | 7:44 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ గుడ్ న్యూస్ అందించనుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై కేంద్రం వార్షిక వడ్డీని అందిస్తున్న విషయం తెలిసిందే. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇటీవల వడ్డీ రేటును నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 8.25 శాతాన్ని కొనసాగించింది. కార్మికశాఖ వడ్డీ రేటును ఆమోదించి కేంద్ర ఆర్థికశాఖకు పంపింది. ఆర్ధికశాఖ త్వరలో ఆమోదించనుందని తెలుస్తోంది. ఆర్దిక మంత్రిత్వశాఖ ఆమోదం తర్వాత పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ కానుంది. పీఎఫ్ అకౌంట్లో ఈ వడ్డీ త్వరలో జమ చేయనుందని తెలుస్తోంది.

పెన్షన్ పరిమితి పెంపు..

ఇక పీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ను పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సరిపోవడం లేదని, రూ.7,500కు పెంచాలని కోరుతున్నారు. ఇటీవల పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ పెంపును సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పెంపు దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈపీఎస్ 95 కింద పెన్షన్ పరిమితి పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్తగా చెప్పవచ్చు. 58 ఏళ్ల తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు నెలనెలా పెన్షన్ అందుతుంది. ఉద్యోగి జీతం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. ఉద్యోగి నుంచి కొంత మొత్తం, యజమాని వాటా కింద కొంత మొత్తం కట్ చేసి పెన్షన్  ఖాతాలో వేస్తారు. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి  రూ.వెయ్యి మాత్రమే ఉంది. ఖర్చులు పెరుగుతున్నా దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. దీంతో ఉద్యోగులు పెన్షన్ పరిమితి పెంచాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే మూడు నెలల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఏటీఎం నుంచి పీఎఫ్  నగదు విత్ డ్రా..

ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో కేంద్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. మీ పీఎఫ్ ఖాతాతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్‌ను ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌కు అనుసంధానిస్తారు. త్వరలోనే పీఎఫ్ డెబిట్ కార్డు పేరుతో ప్రత్యేక కార్డును అందిస్తారు. దీని సాయంతో పీఎఫ్ ఖాతాదారులు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చని తెలుస్తోంది. దీని వల్ల ఎప్పుడు, ఎక్కడైనా పీఎఫ్ నగదు తీసుకోవచ్చు.

Follow Us
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్