Indian Railways: ట్రైన్ టికెట్‌పై H1, A1 అనే కోడ్‌లు ఉన్నాయా..? వీటి వెనుక ఉన్న అసలు అర్థం ఏంటంటే..?
ప్రతీఒక్కరూ ఒక్కసారైనా ట్రైన్‌లో ప్రయాణించి ఉంటారు. ట్రైన్ జర్నీ చేసేందుకు చాలామంది ఇష్టపడతారు. అయితే రైళ్లల్లో ప్రయాణించే సమయంలో టికెట్ నుంచి కోచ్‌లపై ఉండే నెంబర్ల వరకు చాలా విషయాలాు మీకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటికి అర్థం తెలియక చాలామంది పట్టించుకోడం మానేస్తారు.

దేశంలో తరచూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. దేశ నలుమూలకు రైల్వే కనెక్టివిటీ వ్యాపించి ఉంది. ప్రపచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ భారతదేశం కలిగి ఉంది. ఇప్పుడు వందే భారత్ లాంటి వేగంతో ప్రయాణించే, సౌకర్యంతో కూడుకున్న రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు అనేక విషయాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ట్రైన్‌పై ఉండే బోర్డుల నుంచి నెంబర్ల వరకు అనేక విషయాలు మనకు ఆసక్తిని కలిగిస్తాయి. అదే విధంగా ట్రైన్ టికెట్లపై H1, H2, A1, B1 అని రాసి ఉంటాయి. దీని వెనుక అర్ధం ఏంటనే విషయం చాలామందికి తెలియదు. అసలు వీటికి అర్థం ఏంటి..? ఇది దేనిని సూచిస్తాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ క్లాస్ ఏసీ కోడ్‌లు ఇవే..
టికెట్లపై H1 అని ఉంటే అది ఏపీ ఫస్ట్ క్లాస్ అని అర్థం. దూరపు ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లలో ఈ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. బోగీలపై H1 అని ఉంటాయి. వీటిల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విమానం ధరలకు సమానంగా ఈ కోచ్‌ల ఛార్జీ ఉంటుంది. ఇక టికెట్‌తో పాటు భోజనం కూడా అందిస్తారు. విశాలవంతమైన ప్రదేశం, రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, బెల్ సిస్టమ్, బెడ్ షీట్లు వంటి ఇందులో ఉంటాయి. ఇక ట్రైన్‌లో రెండు ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లు ఉంటే H1, H2గా పిలుస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచుల్లో కూపే, క్యాబిన్ అనేవి ఉంటాయి. కూపే అంటే ఇద్దరు ప్రయాణికులకు ప్రత్యేకంగా కంపార్ల్‌మెంట్ ఉంటుంది. ఇక క్యాబిన్ అంటే నలుగురు ప్రయాణికులు ఉంటారు. చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో ఏది కేటాయించాలనేది అధికారులు నిర్ణయిస్తారు.
స్లీపర్ కోచ్‌లపై..
ఇక A1, B1 అని మీ టికెట్, కోచ్‌లపై ఉంటే అది టూ టైర్ ఏసీ కోచ్‌లని అర్థం. ఇందులో కేవలం కర్టెన్లు మాత్రమే ఉంటాయి. ప్రతీ సెక్షన్‌లో 6 బెర్త్‌ల వరకు ఉంటాయి. ఇక B1, B2, B3 అని ఉంటే అవి ఏసీ త్రీ టైర్ కోచ్‌లని అర్థం. ప్రతీ సెక్షన్‌లో ఎనిమిది బెర్త్‌లు అనేవి ఉంటాయి. ఇక S1, S2 అని ఉంటే అవి సాధారణ స్లీపర్ కోచ్‌లని అర్థం. ఇవి నాన్ ఏసీ కోచ్‌లు. ఇక CC అంటే ఏసీ చైర్ కార్ అని అర్థం. అంటే వీటిల్లో ఏసీ సౌకర్యం ఉంటుంది. అయితే కూర్చోని ప్రయాణించాల్సి ఉంటుంది. శతాబ్ది రైళ్లల్లో ఈ కోచ్‌లు ఉంటాయి.
