Success Astrology: మంచి రోజులు వచ్చేశాయ్..! ఇక వారు ఓ వెలుగు వెలగడం ఖాయం!
జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి వారి సహజ లక్షణాలైన నాయకత్వం, దూరదృష్టి, కమ్యూనికేషన్, పట్టుదల వల్ల ఈ ఏడాది విజయాలు సాధించే అవకాశం ఉంది. గ్రహ బలం అనుకూలంగా ఉండటంతో సంవత్సరం చివరికి ఆశించిన ఫలితాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక్కొక్క రాశికి కొన్ని ప్రాథమిక లక్షణాలుంటాయి. ఈ రాశుల్లో కొన్నిటి లక్షణాలను బట్టి ఈ ఏడాది విజయాలు, సాఫల్యాలు కలిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశులకు వారి ప్రధాన లక్షణాలైన నాయకత్వం, దూరదృష్టి, కమ్యూనికేషన్, దూసుకుపోయే తత్వం, వ్యాపార తత్వం, పట్టుదల వంటి వాటి వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. వీరి లక్షణాలకు తగ్గట్టుగా గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరిలోగా వీరి కలలు సాకారమవుతాయి.
- మేషం: నాయకత్వం, ఆధునికత, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే తత్వం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశి వారికి అందుకు తగ్గ అవకాశాలు లభించే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడితో పాటు, భాగ్యాధిపతి గురువు కూడా చేయూతనందిస్తున్నందువల్ల ఈ రాశివారు ఒక సంస్థలో అత్యున్నత పదవి చేపట్టడానికి, ఒక కొత్త సంస్థకు అధిపతి కావడానికి అవకాశం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అలవరచుకోవడంలో వీరు అందరికంటే చాలా ముందుంటారు.
- వృషభం: సంపద వృద్ధికి, కుటుంబ భద్రతకు అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు గురు, శుక్ర, బుధ గ్రహాల బలం వల్ల ఈ ఏడాది చివరి లోగా ఆస్తిపాస్తులను, సిరిసంపదలను బాగా వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. పిల్లలకు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు, జీవిత భాగస్వామికి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సొంత ఇంటితో పాటు, స్థలాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడే అవకాశం ఉంది.
- మిథునం: ఆధునిక విద్య, ఉద్యోగావసరాలకు తగ్గట్టుగా ఈ రాశివారు తమ నైపుణ్యాలను, కమ్యూనికేషన్ చాతుర్యాలను బాగా మెరుగుపరచుకుంటారు. ఈ ఏడాది స్వయంగా ఒక సంస్థను ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వీరి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వీరి సహజ లక్షణమైన కలుపుకునిపోయే తత్వం, దూసుకుపోయే తత్వం బాగా రాణించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరు విదేశీ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశిలోని దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, దూసుకుపోయే తత్వం ఈ ఏడాది పూర్తి స్థాయిలో రాణించే అవకాశం ఉంది. ఒక సంస్థలో ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉంది. వీరి సారథ్యంలో ఎటువంటి వృత్తి, వ్యాపారాలైనా తప్పకుండా ఒక వెలుగు వెలగడానికి వీరికి రవి, గురువులు బాగా సహకరించబోతున్నాయి. వీరికి విదేశీ సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ప్రయత్నించడం కూడా మంచిది.
- తుల: ఈ రాశివారిలోని సహజసిద్ధమైన వ్యాపార లక్షణాలు, వ్యాపార నైపుణ్యాలు ఈ ఏడాది బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య సంస్థలు లేదా వ్యాపార సంస్థల్లో వీరి ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విదేశీ సంస్థల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల రీత్యా విదేశాలకు తరచూ వెళ్లడం జరుగుతుంది. వీరి సారథ్యంలోని వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. వీరికి గురు, శుక్ర, బుధుల అనుకూలత వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది.
- మకరం: ఈ రాశివారిలోని పట్టుదల, ఓర్పు, సహనాలు, ప్రణాళికాబద్ధమైన వ్యవహార శైలి వల్ల ఈ ఏడాది ఈ రాశివారు శీఘ్ర పురోగతి పొందడానికి అవకాశం ఉంది. రాశ్యధిపతి శనితో పాటు, జూన్ నుంచి గురు బలం కూడా పెరుగుతున్నందువల్ల వీరు ఏ రంగంలో ఉన్నా సరైన గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. ఎంత శ్రమకైనా ఓర్చి ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు. ఉద్యోగంలో హోదాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)