AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: తమిళనాడులో దుమారం రేపిన సినిమా.. మూడు వారాలకే ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ..

తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో దళపతి విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఇతడిని టార్గెట్ చేసేలా సరిగ్గా ఎన్నికల ముందు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తీసి రిలీజ్ చేశారు.

OTT Movie: తమిళనాడులో దుమారం రేపిన సినిమా.. మూడు వారాలకే ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ..
TN 2026 Movie
Basha Shek
|

Updated on: Apr 29, 2026 | 4:23 PM

Share

గతవారమే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలి సారి పోటీలో నిలిచాడు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లోనూ టీవీకే పోటీ చేసింది. విజయ్‌ కూడా తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. అదే టీఎన్ 2026. ప్రముఖ కమెడియన్ తంబి రామయ్య ఈ సినిమాకు కథ అందించగా, అతని కుమారుడు ఉమాపతి రామయ్య ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన టీఎన్ 2026 పెద్దగా ఆడలేదు. అంతేగాక తమిళనాడు ఎన్నికలపై కూడా పెద్దగా ప్రభావం చూపించలేదని చెప్పవచ్చు. అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ఓటీటీల్లో ‘టీఎన్ 2026’ స్ట్రీమింగ్ కానుంది.

ఏప్రిల్ 30 అంటే రేపటి నుంచే అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో టీఎన్ 2026 స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళనాడులోని ఓ స్టార్ హీరో తన అభిమాన సంఘాలు అన్నింటినీ ఏకం చేసి రాజకీయాల్లో అడుగు పెడతాడు. ముఖ్యమంత్రి కావాలని ట్రై చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే ‘టీఎన్ 2026’ కథ. విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. మరి థియేటర్లలో ఆకట్టుకోని ఈ మూవీ ఓటీటీలో ఏ మేర అలరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఏకంగా ఐదు ఓటీటీల్లో టీఎన్ 2026 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!