AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కొన్నాళ్లుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో తన ఆలోచనలు, తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అంశాలు, మానవ సంబంధాలు, సామాజిక విషయాలు, వ్యక్తిత్వ వికాసంపై ఆయన తనదైన శైలిలో అభిప్రాయాలను ఇందులో పంచుకుంటారు. తాజాగా రిజెక్షన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2026 | 4:15 PM

Share

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా రిజెక్షన్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎలా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయాన్ని వెల్లడించారు.”జీవితంలో తిరస్కరణ అనేది ఒక అనివార్యమైన భాగం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఎంతో ఆశించిన కల కావచ్చు, తిరస్కరణ ఎదురైనప్పుడు చాలా మందికి గుండె బరువెక్కినట్లు, నీరసం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే, పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా ఈ రిజెక్షన్ ఒక అడ్డంకిగా కాకుండా, ఒక కొత్త ప్రారంభంగా స్వీకరించాలని సూచిస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీ విలువ తగ్గిపోదని, అంతకంటే మంచి అవకాశం మీకు రావచ్చని చెప్పారు. తిరస్కరణను ఒక అవకాశంగా భావించడం ముఖ్యం. జీవితంలో విజయం సాధించిన ఎంతో మంది వ్యక్తులు ఒకప్పుడు ఎవరితోనో రిజెక్ట్ కాబడిన వారే. ఒకరి తిరస్కరణ మిమ్మల్ని నిలువరించలేదు, బదులుగా అది మీలో మరింత కసిని పెంచుతుంది. ఆ అనుభవాలను పాఠాలుగా స్వీకరించి ముందుకు సాగాలి. రిజెక్షన్ బాధగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా మనం సహాయం చేసిన వారు తిరస్కరించినప్పుడు, అన్నింటినీ అంగీకరించడం తప్పనిసరి. ఎవరైనా రిజెక్ట్ చేశారన్న బాధ మనల్ని బలహీనపరచకూడదు. బదులుగా, మీలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేసుకొని, వాటిని సరిదిద్దుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు.

మీ నైపుణ్యాలు లేదా ప్రతిభ మీ వద్ద ఉన్నంత కాలం ఎవరూ మిమ్మల్ని ఆపలేరని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. రిజెక్ట్ అయిన ప్రతిసారీ మీ ప్రతిభను మరింత పెంచుకోవడం ఎలాగో ఆలోచించండి. దీని కోసం చదువుకోవచ్చు లేదా కష్టపడి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ప్రతి తిరస్కరణ మీ ఎదుగుదలకు ఒక మెట్టుగా మారేలా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అన్న వాదనకు ఇది పునాది. తిరస్కరణ వల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదు. ముఖ్యంగా, ఎవరైనా మనల్ని కాదంటే ఒంటరితనం అనే భావన కలగవచ్చు. కానీ ఒక్కరు కాదు, వంద మంది కాదన్నా మీరు కుంగిపోకూడదు.

కొంతమంది మిమ్మల్ని అవమానించి మరీ తిరస్కరించినా పట్టించుకోవద్దని ఆయన సూచించారు. ఎందుకంటే ఒక్కోసారి మనలోని శక్తి, సామర్థ్యం మనకే తెలియదు. మనం అనుకున్న దానికంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉండవచ్చు. చరిత్రలో ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. క్రియేటివిటీ లేదని న్యూస్‌పేపర్‌లో పనిచేసే యువకుడిని ఉద్యోగం నుండి తీసేశారు. వాడే వాల్ట్ డిస్నీ అయ్యాడు. హైస్కూల్‌లో సరిగ్గా ఆడటం రాదని బాస్కెట్‌బాల్ టీమ్ నుండి తొలగించబడిన వ్యక్తి మైఖేల్ జోర్డాన్ అయ్యాడు. మాట్లాడటం రాదని, టెలివిజన్‌కు పనికిరాదని చెప్పబడిన అమ్మాయి ఓప్రా విన్‌ఫ్రేగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రియాలోని వియన్నా వీధుల్లో ఆకలితో తిరిగిన ఒక యువకుడి శక్తి అతడికి తెలియదు, కానీ అతడే అడాల్ఫ్ హిట్లర్ అయ్యాడు. కాబట్టి, ఎవరో కాదన్నారని, వద్దన్నారని బాధపడొద్దు. మన గురించి మనకే తెలియదు, ఇతరులకు ఏం తెలుసు” అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే..భారీ ప్రమాదం
ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే..భారీ ప్రమాదం
హ్యాట్రిక్‌ ట్రోఫీపై కన్నేసిన టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరంటే?
హ్యాట్రిక్‌ ట్రోఫీపై కన్నేసిన టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరంటే?
ఇదేం సినిమా రా బాబు.. అప్పుడు అట్టర్ ప్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.
ఇదేం సినిమా రా బాబు.. అప్పుడు అట్టర్ ప్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.