AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Installation Tips: ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే.. భారీ ప్రమాదంలో పడే ఛాన్స్..!

వేసవి కాలంలో ఏసీ కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే, దానిని సరిగ్గా ఇన్‌స్టాల్ చేయించడం మరో ఎత్తు. చాలా మంది తక్కువ ధరలో దొరికే టెక్నీషియన్లతో ఏసీ అమర్పిస్తుంటారు. అయితే, స్ప్లిట్ ఏసీ ఇన్‌స్టాలేషన్ సమయంలో పైపుల అమరికలో చేసే చిన్న పొరపాట్లు మీ ఏసీ పనితీరును దెబ్బతీస్తాయి. పైపుల విషయంలో జరిగే ముఖ్యమైన పొరపాట్లు ఏంటో తప్పనిసరిగా తెలుసుకోండి.

AC Installation Tips: ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే.. భారీ ప్రమాదంలో పడే ఛాన్స్..!
Ac Installation TipsImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2026 | 4:08 PM

Share

స్ప్లిట్ ఏసీ (Split AC) ఇన్‌స్టాలేషన్ సమయంలో చేసే చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద ఖర్చులకు, ఏసీ పాడవడానికి దారితీస్తాయని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ అమర్చేటప్పుడు పైపుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాధారణంగా జరిగే పొరపాట్ల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. ఏసీ ఇన్‌స్టాలేషన్‌లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు, సరైన పద్ధతి ఏంటో ఇక్కడ చూద్దాం…

బెండింగ్ సమస్య: ఇండోర్ యూనిట్ నుండి అవుట్‌డోర్ యూనిట్‌కు వెళ్లే కాపర్ పైపులను అమర్చేటప్పుడు వాటిని షార్ప్ కార్నర్లలో విపరీతంగా వంచుతుంటారు. ఇలా చేయడం వల్ల పైపుల లోపల ఉండే ఫ్రియాన్ గ్యాస్ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇది కంప్రెసర్ పైన అదనపు భారాన్ని పెంచి, ఏసీ కూలింగ్‌ను తగ్గిస్తుంది.

డ్రెయిన్ పైపు వాలు (Slope): ఏసీ నుండి వెలువడే నీరు బయటకు వెళ్లడానికి డ్రెయిన్ పైపును ఉపయోగిస్తారు. ఈ పైపుకు సరైన వాలు లేకపోతే నీరు వెనక్కి వచ్చి ఇండోర్ యూనిట్ నుండి గదిలో కారుతుంది. దీనివల్ల గోడలు పాడవడమే కాకుండా ఏసీ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇన్సులేషన్ లోపాలు: కాపర్ పైపులకు చుట్టే ఫోమ్ ఇన్సులేషన్ సరిగ్గా లేకపోతే, పైపుల మధ్య వేడి చేరి కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. గాలి చొరబడకుండా పైపులను పూర్తిగా కవర్ చేయడం ముఖ్యం.

అవుట్‌డోర్ యూనిట్ దూరం: ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్ల మధ్య దూరం వీలైనంత తక్కువగా ఉండాలి. పైపు పొడవు పెరిగే కొద్దీ కంప్రెసర్ ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది.

ఏసీ ఇన్‌స్టాలేషన్ సమయంలో ఎల్లప్పుడూ నిపుణులైన టెక్నీషియన్లను సంప్రదించాలి. పైపుల జాయింట్ల వద్ద లీకేజీలు లేకుండా చూసుకోవడం, గ్యాస్ ప్రెజర్ చెక్ చేయడం ద్వారా ఏసీ ఎక్కువ కాలం మన్నుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే..భారీ ప్రమాదం
ఏసీ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేశారంటే..భారీ ప్రమాదం
హ్యాట్రిక్‌ ట్రోఫీపై కన్నేసిన టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరంటే?
హ్యాట్రిక్‌ ట్రోఫీపై కన్నేసిన టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరంటే?
ఇదేం సినిమా రా బాబు.. అప్పుడు అట్టర్ ప్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.
ఇదేం సినిమా రా బాబు.. అప్పుడు అట్టర్ ప్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.