స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తుంది..
Rajitha Chanti
Pic credit - Instagram
29 April 2026
మసూద' చిత్రంతో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యువ నటి బాంధవి శ్రీధర్. తాజాగా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో ఆమె ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది.
తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బాంధవి, తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆమె ముఖంలోని చిరునవ్వు, ఆనందం ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వేడుకల కోసం ఆమె ఎంచుకున్న దుస్తులు, ఆమె సింప్లిసిటీ నెటిజన్లను ముగ్ధులను చేస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సహ నటీనటులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి ఆమె పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది 'మసూద' సినిమా.
ఆ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఆ సినిమాలో బాంధవి నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. వచ్చిన ఆఫర్స్ వదులుకోకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది బాంధవి శ్రీధర్.
తన సహజ సిద్ధమైన అందంతో, గ్లామర్ హంగులకు దూరంగా ఉంటూనే యూత్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.