AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

May 2026 Horoscope: మే నెలలో ఆ రాశులకు జాక్‌పాట్.. ఆదాయం–అధికారం డబుల్ ధమాకా!

May 2026 Horoscope: మే నెలలో నాలుగు గ్రహాలు కుజ, బుధ, రవి, శుక్ర గ్రహాల రాశి మార్పులు సంభవించనుంది. దీని ప్రభావంతో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, మకర రాశుల వారికి ఆకస్మిక శుభ మార్పులు తీసుకురానున్నాయి. ఆదాయం, అధికారంలో వృద్ధి కనిపించగా, ఉద్యోగ–వ్యాపారాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2026 | 3:56 PM

Share
మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. కుజ, బుధ, రవి, శుక్రులు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఈ నెలలో జీవితంలో ఆకస్మిక సానుకూల మార్పులతో పాటు, సంచలనాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. బుధుడు మే 1న, కుజుడు 12న మేష రాశిలో ప్రవేశం, శుక్రుడు 14న మిథునంలోకి, రవి 16న వృషభం లోకి ప్రవేశించడం జరుగుతోంది. వీటి వల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, మకర రాశివారి జీవితాల్లో ఆదాయానికి, అధికారానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 7
మేషం: రాశినాథుడు కుజుడు ఈ రాశిలో సంచారం చేయడంతో పాటు ధన స్థానం బాగా బలపడుతున్నందువల్ల మే నెలంతా ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఊహించని స్థాయిలో గౌరవమర్యాదలు, రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా విజయాలు సాధిస్తాయి. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తులు సమకూరుతాయి.

2 / 7
వృషభం: ఈ రాశిలోనూచ ధన స్థానంలోను గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగం లోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవ కాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో జీతాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. జీవనశైలి మెరుగుపడుతుంది.

3 / 7
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు కుజ సంచారం కూడా జరుగుతున్నందు వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సంచలన మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

4 / 7
కర్కాటకం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాలు సంచారం చేయడం వల్ల కలలో కూడా ఊహించని స్థాయిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. విదేశీయానాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

5 / 7
సింహం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో గ్రహాల సంచారం పెరుగుతున్నందువల్ల అనేక విధాలుగా రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఉన్నత స్థానాలకు వెళ్లే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారమవుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా చెలామణీ కావడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి.

6 / 7
మకరం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం పెరుగుతున్నందువల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంటుంది.

7 / 7
Follow Us