Tollywood : అతడితో నటిస్తే స్టార్ హీరోయిన్ అవ్వాల్సిందే.. ఏకంగా 60 మంది తారల లైఫ్ మార్చేసిన హీరో..
సినీరంగంలో అతడు చాలా స్పెషల్. కెరీర్ తొలి నాళ్లలో హీరోగా అలరించారు. వరుస సినిమాలతో అప్పట్లో ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత సహయ నటుడిగా మారి తన వైవిధ్యమైన పాత్రలు.. సహజ నటనతో కట్టిపడేశాడు. అంతేకాదు.. అప్పట్లో ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి హీరోయిన్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ?

తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది నటులు తమదైన ముద్ర వేశారు. హీరోలుగా నటించి.. ఆ తర్వాత సహయ పాత్రలతో అలరించిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి స్టార్ హీరోలు దిగ్గజాలు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్న హీరో గురించి మీకు తెలుసా..? అతడితో నటించిన ప్రతి హీరోయిన్ దశ మారిపోయింది. వరుస సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అతడు మరెవరో కాదు.. దివంగత నటుడు చంద్రమోహన్. అప్పట్లో హీరోగా మెప్పించాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఏకంగా 60 మంది హీరోయిన్లకు పైగా సినీరంగానికి పరిచయం చేశారు. అత్యధిక హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
చంద్రమోహన్ విషయంలో పరిస్థితి వేరేలా ఉండేది. ఆయన తన ప్రతి సినిమాకు కొత్త కొత్త హీరోయిన్లతో నటించేవారు. అప్పట్లో ఆయనను హీరోయిన్ల పాలిట లక్కీ హ్యాండ్ అనేవారు. ఆయనతో నటించిన ప్రతి హీరోయిన్ స్టార్ డమ్ అందుకోవడమే ఖాయమనే టాక్ నడిచేది. అది కేవలం ప్రచారం మాత్రమే కాదు.. నిజం కూడా. శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి స్టార్ హీరోయిన్స్.. కెరీర్ మొదట్లో చంద్రమోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ తన పక్కన నటించిన 60 మంది హీరోయిన్లు ఎక్కువ మంది అగ్రస్థానానికి చేరడం.. వారి ప్రతిభ, అదృష్టం తప్ తన గొప్పతనం ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
1966లో రంగుల రాట్నం అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు చంద్రమోహన్. ఆ తర్వాత వరుసగా పలు అవకాశాలు అందుకుని నిరూపించుకున్నాడు. సహయ నటుడిగా మెప్పించారు. తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, తాతగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. దాదాపు 900కు పైగా సినిమాల్లో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

Chandra Mohan
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..
