AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు.. ఆ లక్కీ కారు ఏదో తెలుసా?

Maruti Suzuki: భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ప్రామాణికంగా వస్తాయి. ఇతర మారుతీ నెక్సా (Nexa) కార్లపై ఆఫర్లు ఉన్నాయి..

Subhash Goud
|

Updated on: Apr 29, 2026 | 1:17 PM

Share
 Maruti Suzuki Invicto: మారుతీ సుజుకి కార్లపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఇంతకీ ఈ ఆఫర్ బాలెనో లేదా గ్రాండ్ విటారా పైనా? అంటే... కాదు, ఇది మారుతీ సుజుకి అత్యంత ఖరీదైన మోడల్ 'ఇన్విక్టో' (Invicto) పై లభిస్తోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి, తన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఇన్విక్టో ఎంపీవీపై ఏప్రిల్ 2026 నెలలో ఈ భారీ తగ్గింపును ప్రకటించింది.

1 / 5
 మొత్తం తగ్గింపు: రూ.2.15 లక్షల వరకు అందిస్తోంది. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉన్నాయి. దీని ధర విషయానికొస్తే.. మారుతీ ఇన్విక్టో ధర రూ.24.97 లక్షల నుండి రూ.28.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది.

2 / 5
 ఇన్విక్టో ప్రత్యేకతలను పరిశీలిస్తే.. హైబ్రిడ్ ఇంజన్: ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఇది 184hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజీ: ఏఆర్ఏఐ (ARAI) ప్రకారం, ఈ కారు లీటరుకు 23.24 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

3 / 5
 భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ప్రామాణికంగా వస్తాయి. ఇతర మారుతీ నెక్సా (Nexa) కార్లపై ఆఫర్లు ఉన్నాయి.

4 / 5
 ఇన్విక్టోతో పాటు ఇతర మోడల్స్‌పై కూడా మారుతీ సుజుకి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. గ్రాండ్ విటారా (Grand Vitara): రూ.1.07 లక్షల వరకు ఉండగా, ఫ్రాంక్స్ (Fronx): రూ.55,000 వరకు ఉంది. అలాగే  జిమ్నీ (Jimny): రూ.50,000 వరకు, ఇగ్నిస్ (Ignis): రూ.50,000 వరకు,  అలాగే XL6: రూ.50,000 వరకు,  బాలెనో (Baleno): రూ.40,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ముఖ్య గమనిక: ఈ ఆఫర్లు కేవలం ఏప్రిల్ 2026 నెలకు మాత్రమే పరిమితం. డీలర్‌షిప్, ప్రాంతాన్ని బట్టి ఈ తగ్గింపు ధరల్లో మార్పులు ఉండవచ్చు.

5 / 5
Follow Us