AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజ్జెల చప్పుళ్లు వినిపిస్తే ఏమి జరుగుతుంది? అమ్మవారి దివ్య అనుగ్రహ సంకేతమా?

Anklet Sounds Spirituality: ధ్యానంలో పట్టు సాధించిన భక్తులకు అమ్మవారు వారి వెనకాల తిరుగుతూ గజ్జెల చప్పుళ్ల రూపంలో అనుసరిస్తారు. శారదాదేవి జీవితంలో అమ్మవారి దర్శనాలు, అష్టలక్ష్ములు ఆమెను అనుసరించిన సంఘటనలు ఆమె భక్తికి నిదర్శనం. అమ్మవారిని నమ్ముకున్న వారికి చిన్న బెంగ వచ్చినా ఏదో రూపంలో వచ్చి సహాయం చేస్తుంది.

Rajashekher G
|

Updated on: Apr 29, 2026 | 10:49 AM

Share
ధ్యానంలో బాగా పట్టు సాధించిన భక్తులకు అమ్మవారు వారిని వదిలి ఉండలేక నిరంతరం అనుసరిస్తూ ఉంటారు. అటువంటి మహాత్ములు నివసించే చోట ఇంట్లో గజ్జెల చప్పుళ్లు వినిపిస్తూ ఉంటాయని ప్రవచనంలో వివరించబడింది. ఇది కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే కాకుండా, భక్తుల సాధారణ జీవితంలోనూ అమ్మవారి దివ్యమైన, ప్రత్యక్షమైన సాయాన్ని తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన స్థితిని రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి జీవిత సంఘటనల ద్వారా చాగంటి ప్రవచనంలో ప్రస్తావించారు.

1 / 5

శారదాదేవి తన భర్త రామకృష్ణ పరమహంస వద్దకు కలకత్తాకు వెళ్ళే మార్గమధ్యంలో తీవ్ర జ్వరానికి గురయ్యారు. ఆమె స్పృహ కోల్పోయి, తండ్రి పక్కన అచ్చాదన మండపంలో పడుకుని ఉన్నారు. ఈ స్థితిలో ఆమెకు గజ్జెల చప్పుళ్లు వినిపించాయి. కళ్ళు తెరిచి చూడగా, నల్లని వర్ణంలో ఉన్న ఒక దివ్య స్త్రీ ఆమె వద్దకు వస్తూ కనిపించారు.

2 / 5

శారదాదేవి తన జీవిత చరిత్రలో రాసుకున్న ప్రకారం, అంత అందగత్తెను తన జన్మాంతరంలో చూడలేదని పేర్కొన్నారు. ఆ స్త్రీ పార్వతి, కాళికా రూపమే. ఆవిడ శారదాదేవి పక్కన కూర్చుని, ఆమె బెంగను తెలుసుకుని, జ్వరం తగ్గిపోతుందని ఆశీర్వదించారు. ఆ మర్నాటికే శారదాదేవి జ్వరం తగ్గిపోయి, రామకృష్ణ పరమహంస వద్దకు చేరుకున్నారు. ఇది అమ్మవారి ఉపాసన వల్ల కాకుండా, శారదాదేవి సహజసిద్ధమైన భక్తి వల్ల లభించిన దర్శనం.

3 / 5

మరొక సంఘటనలో, శారదాదేవికి 13 సంవత్సరాల వయస్సులో రామకృష్ణ పరమహంస గ్రామం కామార్పుకూర్‌లో జరిగింది. తెల్లవారుజామున హలధర పుష్కరిణి అనే చెరువులో స్నానం చేయడానికి వెళ్ళమని పెద్దలు చెప్పారు. చీకట్లో, తెలియని ఊరిలో ఒంటరిగా వెళ్ళడానికి బెంగ పడుతున్న శారదాదేవి గడ్డం మీద చేయి వేసుకుని ఆలోచిస్తుండగా, ఆమె ముందు నలుగురు, వెనక నలుగురు గొప్ప స్త్రీలు కనిపించారు. వారు తాము కూడా హలధర పుష్కరిణికి స్నానానికి వెళ్తున్నామని చెప్పి, శారదాదేవిని వారితో పాటు తీసుకువెళ్లారు. వారి పాద మంజీర ధ్వనులను వింటూ శారదాదేవి స్నానానికి వెళ్లారు. స్నానం ముగించుకొని తిరిగి వస్తుండగా, ఆ ఎనమండుగురు స్త్రీలు ఆమెను ఇంటి ముందు దిగబెట్టి వెళ్లిపోయారు. ఆ ఎనమండుగురు అష్టలక్ష్ములే.

4 / 5
అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు, వారికి చిన్న బెంగ కలిగినా, అమ్మవారు ధ్యానంలో మాత్రమే కాకుండా, ఏదో ఒక రూపంలో వచ్చి వారిని అనుసరించి, ఆదుకుంటుందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తాయి. అటువంటి భక్తులు అమ్మవారి పాద మంజీరముల ధ్వనులను వింటూ ఉంటారు. ధ్యానంలో అమ్మవారి దర్శనం పొంది, ఆమె కదలికలను చూసినవాడే జీవితంలో అదృష్టవంతుడు, విజయాలను చేరుకోగలడు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు, వారికి చిన్న బెంగ కలిగినా, అమ్మవారు ధ్యానంలో మాత్రమే కాకుండా, ఏదో ఒక రూపంలో వచ్చి వారిని అనుసరించి, ఆదుకుంటుందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తాయి. అటువంటి భక్తులు అమ్మవారి పాద మంజీరముల ధ్వనులను వింటూ ఉంటారు. ధ్యానంలో అమ్మవారి దర్శనం పొంది, ఆమె కదలికలను చూసినవాడే జీవితంలో అదృష్టవంతుడు, విజయాలను చేరుకోగలడు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో