AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీ ఆవేదన

తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ నటి జీవితంలో ఎన్నో కన్నీటి గాథలున్నాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆప్యాయంగా చూసుకునే అన్నా వదినలు కూడా చనిపోయారు. ఇక ఎంతగానో ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కూడా మధ్యలోనే ఆమెను వదిలి పెట్టి పోయాడు.

Bigg Boss: చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీ ఆవేదన
Bigg Boss Actress
Basha Shek
|

Updated on: Apr 29, 2026 | 1:19 PM

Share

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సీరియల్స్ లో నటించిన ఈ అందాల తార బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. విజేతగా నిలవకున్నా తన అందం, అమాకత్వం, ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసుల్ని గెల్చుకుంది. అయితే తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కీర్తి భట్ జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు దాగి ఉన్నాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరినీ కోల్పోయింది. ప్రేమించిన వాళ్లు మోసం చేశారు. కొన్ని రోజుల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ తో కూడా విడిపోయింది. ప్రేమ సంగతి పక్కన పెడితే తన ఫ్యామిలీ మరణం వెనక తన బంధువుల కుట్ర కూడా ఉందంటోంది కీర్తి. 2017లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీర్తి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు కోల్పోయారు. తన తల్లిదండ్రులు, అన్న, వదినలందరూ కన్నుమూశారు. కీర్తి మాత్రం తీవ్ర గాయలతో ప్రాణాలతో బయటపడింది. అయితే ఆ ప్రమాదం వెనక తన బంధువుల కుట్ర ఉందని కీర్తి సంచలన ఆరోపణలు చేసింది.

‘ మా అమ్మానాన్నపై బ్లాక్ మ్యాజిక్, చేతబడి చేయించారు. మా నాన్న ఎదుగుదలను ఓర్వలేక కొందరు బంధువులు ఇలా చేశారు. ఒకే కారులో నేను, మా అమ్మ, మా నాన్న ఉన్నాం. వాళ్లు చనిపోయారు.. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను. నా కాలికి ఫ్రాక్చర్ అయింది. చాలా చోట్ల గాయాలయ్యాయి. కోమాలో ఉండాల్సి వచ్చింది. నడవలేని పరిస్థితి వచ్చింది.అయితే నేను బతికి బయటపడతానని వాళ్లు ఊహించలేదు. నేను కోమా నుంచి బయటకొచ్చి మాట్లాడటం చూసి వాళ్లు షాక్ అయ్యారు. అప్పటి నుంచి నన్ను వేధించడం మొదలుపెట్టారు. తిండి కూడా సరిగా పెట్టేవారు కాదు. మానసికంగా తీవ్రంగా హింసించారు. ఇక మా మామ కొడుకు నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ కీర్తి కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

కీర్తీ బట్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us