AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.! రూ. 500తో చేసిన ఈ కూలర్ ఆన్ చేస్తే..

నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌తో ఒక వ్యక్తి ఏసీని తలదన్నే కూలర్‌ను తయారు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దేశీ జుగాడ్ వీడియో విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. అదేంటో తెలియాలంటే మీరు ఇది చూడాల్సిందే. ఓసారి లుక్కేయండి. ఆ వివరాలు..

Video: వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.! రూ. 500తో చేసిన ఈ కూలర్ ఆన్ చేస్తే..
Trending
Ravi Kiran
|

Updated on: Apr 29, 2026 | 12:48 PM

Share

మన ఇండియన్స్‌లో ఉన్న క్రియేటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి సాధారణ నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌ను హై-టెక్ కూలర్‌గా మార్చేశాడు. దీని గాలి ఏసీని తలదన్నేలా ఉందని చూసినవారు కామెంట్ చేస్తున్నారు.

ఆ వ్యక్తి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్‌ను తీసుకుని దానికి మధ్యలో కటింగ్ చేసి, లోపల మోటార్, ఫ్యాన్‌ను అమర్చాడు. గాలి చల్లగా రావడానికి చుట్టూ గడ్డి, నీటి సరఫరా కోసం చిన్న పైపులను సెట్ చేశాడు. ఈ కూలర్‌ను ఆన్ చేయగానే వచ్చే చల్లటి గాలి గదిని నిమిషాల్లో ‘షిమ్లా’లా మార్చేస్తోందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాలో ఈ వీడియోను ఇప్పటికే పది లక్షల మందికి పైగా చూశారు. “నీలిరంగు డ్రమ్‌ను ఇలా కూడా వాడొచ్చని ఎప్పుడూ అనుకోలేదు” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “ఈ టాలెంట్ ఇండియా దాటి వెళ్లకూడదు” అని మరొకరు చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎలక్ట్రికల్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

View this post on Instagram

A post shared by INDIAN (@indianfeed24hrs)

ఇది చదవండి: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..

Follow Us
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్