AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..

కేవలం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ రికార్డులను తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆటతీరుకు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఫిదా అయ్యారు. సూర్యవంశీ విధ్వంసం, అక్తర్ ప్రశంసల వివరాలు ఇక్కడ ఉన్నాయి. లేట్ ఎందుకు ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

Vaibhav Suryavanshi: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..
Pakistan Vs Vaibhav Suryava
Ravi Kiran
|

Updated on: Apr 29, 2026 | 8:47 AM

Share

సాధారణంగా 15 ఏళ్ల వయసులో పిల్లలు క్లాస్‌రూమ్‌లలో పాఠాలు వింటూ పరీక్షల గురించి ఆందోళన చెందుతుంటారు. కానీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అతను పుస్తకాలకు బదులుగా బ్యాట్‌ను, పాఠాలకు బదులుగా పరుగుల వరదను ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ బుడ్డోడు సృష్టించిన సునామీకి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

సూర్యవంశీ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అలాగే నిన్న జరిగిన పంజాబ్ మ్యాచ్‌లోనూ 43 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక SRH మ్యాచ్ విషయానికొస్తే.. ఆ జట్టుతో రాజస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడింది. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, తర్వాతి మ్యాచ్‌లో మాత్రం ఆ చేదు జ్ఞాపకాన్ని తుడిచివేస్తూ హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని ఐపీఎల్ చరిత్రలో ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు.

ఈ కుర్రాడి ఆట తీరును చూసిన షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించారు. “వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ పాకిస్థాన్‌లో ఎందుకు లేడా అని అనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యున్నత బ్యాటర్‌గా అతను ఎదుగుతున్నాడు. 15 ఏళ్లకే ఇంత భయంకరంగా ఆడుతుంటే, అతని ముందు పాకిస్థాన్‌లోని ఏ ఒక్క ఆటగాడు కూడా సరిపోడు” అని అక్తర్ పేర్కొన్నారు. క్రీజులో సూర్యవంశీ ఐదారు ఓవర్లు ఉంటే చాలు బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతుందని ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. క్రికెట్ భవిష్యత్తులో సూర్యవంశీ ఒక మెరిసే నక్షత్రం కాబోతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.

ఇది చదవండి: ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు.. లిస్టు చూస్తే షాకే

Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?