Telangana SSC Results 2026 Live: తెలంగాణ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Telangana 10th Class Results 2026 Live Updates: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు విడుదలయ్యాయి. విద్యార్ధులు తమ ఫలితాలను ఈ కింది లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోండి..

LIVE NEWS & UPDATES
-
రేపట్నుంచే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపులు.. పూర్తి వివరాలు ఇక్కడ చెక్ చేసుకోండి
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 30, 2026వ తేదీ నుంచి మే 14, 2026వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో విద్యార్ధులు ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటికంగ్‌కు రూ.500, రీ- వెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
-
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజుకు చివరి తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 రాయగోరే విద్యార్ధులు మే 14, 2026వ తేదీ వరకు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్ధులు తాము చదువుతున్న స్కూళ్లల్లో ఫీజు చెల్లించాలి.
-
-
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ 2026 పరీక్షల షెడ్యూల్ ఇదే
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5, 2026 నుంచి జూన్ 12వ తేదీ వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
-
తగ్గేదేలే.. అంటున్న గురుకులాలు! భారీగా ఉత్తీర్ణత
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో దాదాపు 99.1 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు.
-
గతేడాది కంటే ఈ సారి ఫలితాల్లో మెరుగుదల
గతేడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 92.78 శాతం మేర ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అబ్బాయిలు 91.32 శాతం ఉండగా.. అమ్మాయిలు 94.78 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది గరిష్ఠంగా 95.15 శాతం మంది విద్యార్ధులు పాస్ అయ్యారు.
-
-
పది ఫలితాల్లో టాప్ లేపిన తెలంగాణ
గత పదేళ్లలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణల నమోదైంది. ఏకంగా 95.15 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు.
-
4.97 లక్షల మంది టెన్త్ విద్యార్ధులు ఉత్తీర్ణత
టెన్త్ పరీక్షలు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకాగా.. ఇందులో మొత్తం 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 96.26 శాతం, బాలురు 94,07 శాతం ఉత్తీర్ణత సాధించారు
-
-
ఈసారి టెన్త్ మార్కుల మెమోలో ఈ మార్పులు గమనించారా?
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయగా.. ఇందులో 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు.
-
‘పది’ ఫలితాల్లో అట్టడుగున హైదరాబాద్
హైదరాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉత్తీర్ణత నమోదైంది. అక్కడ 89.23% మంది విద్యార్ధులు పాస్ అయ్యారు.
-
పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల సత్తా.. అన్ని సబ్జెక్టుల్లో టాప్ ర్యాంకులన్నీ వారివే
పది పరీక్షలు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకాగా ఫలితాల్లో మొత్తం 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 96.26 శాతం, బాలురు 94,07 శాతం ఉత్తీర్ణత సాధించారు.
-
టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్..
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన కె.కేశవరావు www.tv9telugu.comలో టెన్త్ ఫలితాలు టెన్త్‌లో మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత 6 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% ఉత్తీర్ణత హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23% ఉత్తీర్ణత
-
ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత
తెలంగాణ రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫెయిలైన వారికి జూన్ మొదటి వారంలో సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.
-
పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన సర్కార్ బడులు.. 100 శాతం ఉత్తీర్ణత
బుధవారం మధ్యాహ్నం 2 గంటకు విడుదలైన తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్ష ఫలితాల్లో 95.15 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
-
టెన్త్ ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మొదటి వారంలో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
-
తొలిసారి వాట్సాప్ ద్వారా పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు — టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కేకే — పదో తరగతి పరీక్షలు రాసిన 5.17 లక్షల మంది విద్యార్థులు — మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు సాగిన టెన్త్ పరీక్షలు — మొదటిసారి వాట్సాప్ ద్వారా విద్యార్థులకు ఫలితాలు — గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులు
వాట్సాప్ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేస్తే.. వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
-
టెన్త్ ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయి
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన కె.కేశవరావు www.tv9telugu.comలో టెన్త్ ఫలితాలు టెన్త్‌లో మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత
-
తెలంగాణ పదో తగరతి ఫలితాల్లో 95 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ పదో తగరతి ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 95.15 శాతం మంది విద్యార్ధులు పాస్ అయినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
-
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. ఒక్క క్లిక్ తో ఇక్కడ చెక్ చేసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా ఎదురు చూస్తున్న 5 లక్షలకు పైగా విద్యార్ధుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ లోనూ నేరుగా చెక్ చేసుకోండి.
తెలంగాణ టెన్త్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
తెలంగాణ పదో తరగతి ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ పదో తరగతి ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో టెన్త్ ఫలితాలు 2026 డౌన్‌లోడ్
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి.
-
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు SCERT క్యాంపస్ ఆడిటోరియంలో టెన్త్ ఫలితాలు వెల్లడి
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్, ఎల్‌బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎస్సీఈఆర్టీ (SCERT) క్యాంపస్ లోని గోదావరి ఆడిటోరియంలో బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
-
ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా టెన్త్ ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ నవీన్ నికోలస్ పాల్గొంటారు.
-
యేటా ఏప్రిల్ చివరి వారంలోనే టెన్త్ ఫలితాలు
తెలంగాణలో సాధారణంగా ఏటా ఏప్రిల్ చివరి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తుంటారు. గత ఏడాది కూడా ఏప్రిల్ 30న ఫలితాలు వెల్లడించారు. కానీ 2022లో మాత్రం కోవిడ్ కారణంగా జూన్ 30న అందరినీ పాస్ చేస్తూ విద్యాశాఖ ప్రకటించింది.
-
డిజిలాకర్ యాప్‌లో కూడా టెన్త్ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?
టెన్త్ విద్యార్థులు డిజి లాకర్ యాప్‌లోనూ రిజల్ట్స్ చూసుకోవచ్చు. మీ ఫోన్లో డిజిలాకర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రోల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు.. మార్కులు వెంటనే కనిపిస్తాయి.
-
తెలంగాణ పదో తరగతి ఫలితాల ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి
-
ఏప్రిల్ 23తో ముగిసిన మూల్యాంకనం.. కేవలం 7 రోజుల్లోనే ఫలితాలు
జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగింది. కేవలం 7 రోజుల్లోనే మార్కుల ఎంట్రీ ప్రాసెస్‌ను పూర్తిచేసిన విద్యాశాఖ వేగంగా ఫలితాలను వెల్లడించింది.
-
వాట్సప్ లోనూ పదో తరగతి ఫలితాలు.. ఎలా చెక్ చేయాలంటే
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లతోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేస్తే.. వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
-
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 నేరుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
-
ఉత్కంఠగా 5 లక్షల మంది విద్యార్ధుల ఎదురు చూపు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో ప్రభుత్వ సలహాదారు కెకె చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ లింక్‌లోనూ డైరెక్ట్‌గా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14న నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Published On - Apr 29,2026 1:08 PM




