చాణక్య నీతి : ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే 7 చెడు అలవాట్లు ఇవే!
samatha
29 April 2026
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకున్నాడు.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు ఒక వ్యక్తి సమాజంలో ఎలా జీవించాలి. ఎలా ఉంటే గొప్ప స్థాయికి ఎదుగుతారు అనే విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
సమాజంలో జీవించడం
అదే విధంగా ఒక వ్యక్తి తన జీవితంలో తనకు తెలియకుండా చేసే ఈ చిన్న పొరపాట్లే అతన్ని ఇబ్బందులకు గురి చేస్తాయని తెలియజేశాడు. అవి ఏవి అంటే?
చిన్న పొరపాట్లు
ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తికి బద్ధకం అనేది అతి పెద్ద శత్రువు. అందువలన బద్ధకం ఉన్న వ్యక్తి ఎప్పుడూ జీవితంలో గొప్ప స్థాయికి రాలేరు.
బద్ధకం
ఒక వ్యక్తికి సంపద వచ్చినా, హోదా వచ్చినా, ఇతరులను తక్కువ చూస్తుంటారు. అయితే ఎవరు ఇలా అహంకారంతో ఇతరులను తక్కువ చూస్తారో వారు జీవితంలో గెలుపు సాధించలేరంట.
అహంకారం
ఏ వ్యక్తి అయితే తన దురుసు లేదా ఇతరుల మనసు నొచ్చుకునేలా మాట్లాడుతారో, అతను కూడా తన సహోద్యోగులతో గౌరవాన్ని పొందలేరు.
దురుసు మాటలు
ఒక వ్యక్తి జీవితం అనేది అతని స్నేహంతో ముడిపడి ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్న వ్యక్తితో స్నేహం చేయడం వలన ఆ ప్రభావం వీరిపై కూడా పడుతుంది.
చెడు స్నేహం
అలాగే ఎవరు అయితే ఆడంబరాల కోసం మాత్రమే బతుకుతారో, వారి జీవితంలో అన్ని కోల్పోయి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.