ఈ రూట్లలో త్వరలో వందే భారత్ మెట్రో

Venkatrao Lella

Images: Pinterest

16 April 2026

వందే భారత్ మెట్రోలను రాబోయే కొద్ది నెలల్లో భారతీయ రైల్వే ప్రవేశపెట్టనుంది. తక్కువ దూరం కలిగిన సిటీలను కలిపేందుకు వీటిని తీసుకురానుంది. ఇవి రైల్వే ప్రయాణాన్ని ఎలా మార్చబోతున్నాయనేది ఇందులో చూద్దాం.

వందే భారత్ మెట్రో

వందే భారత్ మెట్రో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇది తక్కువ దూరం కలిగిన నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయనున్నాయి. దీంతో గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు.

హైస్పీడ్ మెట్రో

వందే మెట్రోలో మెరుగైన ప్రయాణ నాణ్యత, పూర్తిగా సీల్ చేయబడిన గ్యాంగ్‌వేలు వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి.

మెట్రో ప్రయాణ నాణ్యత

ప్రస్తుత మెట్రో రైళ్లు, మెయిన్‌లైన్ EMUల కంటే వందే మెట్రోలో ఉన్నతమైన సౌకర్యాలు ఉంటాయి. ఇందులో కూర్చోవడానికి, నిలబడటానికి సదుపాయం ఉంటుంది. ప్రతి కోచ్‌లో 100 మంది ప్రయాణికులు కూర్చోవడానికి, 200 మంది నిలబడటానికి స్థలం ఉంటుంది.

మెట్రో ఫీచర్లు

మెట్రో రైళ్ల మాదిరిగానే ప్రయాణికులు సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా వందే మెట్రోలో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఉంటాయి.

ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు

ప్రారంభంలో ఈ వందే భారత్ మెట్రో రైళ్లు పూర్తిగా ఏసీతో ఉంటాయి. అయతే నాన్-ఏసీ కోచ్‌లను కూడా పరిశీలిస్తున్నామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.

ఫుల్ ఏసీ రైలు

ప్రయాణికుల భద్రత కోసం వందే మెట్రోలో అత్యవసర టాక్ బ్యాక్ బటన్లు, సీసీటీవీ కెమెరాలు, కవచ్ రైలు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ ఉంటాయి.

ప్రయాణీకుల భద్రత

వందే మెట్రోలో మాడ్యులర్ టాయిలెట్లు, విశాలమైన పనోరమిక్ కిటికీలు, LCD డిస్‌ప్లేలతో కూడిన ప్రయాణీకుల సమాచార వ్యవస్థలు ఉంటాయి.

మాడ్యులర్ టాయిలెట్లు

వందే మెట్రో తిరుపతి-చెన్నై, ఆగ్రా-మధుర, లక్నో-కాన్పూర్, ఢిల్లీ-రేవారి, భువనేశ్వర్-బాలాసోర్ మార్గాల్లో నడపనున్నారు.

మెట్రో మార్గాలు