AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి మొక్కకు నిమ్మకాయ తొక్కలు వేస్తున్నారా? ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదలరు!

ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కానీ, చాలా మందికి తులసి మొక్కను ఎలా సంరక్షించాలో తెలియక, అది త్వరగా ఎండిపోవడం చూసి ఆందోళన చెందుతారు. తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా, కళకళలాడుతూ ఉండాలంటే మనం వంటింట్లో పారేసే నిమ్మకాయ తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. తులసి మొక్కలో నిమ్మకాయ తొక్కలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Apr 29, 2026 | 6:21 PM

Share
తులసి మొక్కను హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే, వాతావరణ మార్పుల వల్ల లేదా కీటకాల వల్ల ఈ మొక్క త్వరగా ఎండిపోతుంటుంది. తులసి మొక్కను ఆరోగ్యంగా, పచ్చగా ఉంచడానికి నిమ్మకాయ తొక్కలు అద్భుతమైన ఎరువుగా పనిచేస్తాయి. తులసి మొక్క పెరగడానికి కొంచెం ఆమ్ల గుణం (Acidic) ఉన్న మట్టి అవసరం. నిమ్మ తొక్కల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మట్టిలోని pH స్థాయిని సరిచేసి, మొక్క ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

1 / 5
నిమ్మ తొక్కల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మట్టిలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది మొక్క వేర్లకు పోషణను అందించి, ఎదుగుదలను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, నిమ్మ తొక్కల్లో ఉండే సుగంధ తైలాలు, ఘాటైన వాసన వల్ల తులసి మొక్కను ఆశించే ఫంగస్, చీమలు, ఇతర కీటకాలు దరిచేరవు. ఇది ఒక నేచురల్ పెస్టిసైడ్‌లా పనిచేస్తుంది.

2 / 5
నిమ్మ తొక్కల ఘాటైన వాసన వల్ల మొక్క దరిదాపుల్లోకి చీడపీడలు, చీమలు రావు. ఎండిన నిమ్మ తొక్కలను పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో నానబెట్టి ఆ నీటిని పోయడం వల్ల తులసి మొక్క తాజాగా ఉంటుంది. ఇది తులసికి ఒక రక్షణ కవచంలా పనిచేసి, మొక్కను ఎండిపోకుండా కాపాడుతుంది.

3 / 5
నిమ్మ తొక్కల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మట్టిలో కలిసినప్పుడు తులసి వేర్లకు బలాన్ని ఇచ్చి, ఆకులు పచ్చగా ఉండేలా చేస్తాయి. మట్టిలో పోషక లోపం వల్ల తులసి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. నిమ్మ తొక్కల పొడిని మట్టిలో చేర్చడం ద్వారా ఆకులు తాజాగా, నిగనిగలాడుతూ ఉంటాయి. శీతాకాలంలో లేదా అధిక ఎండలో తులసి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. నిమ్మ తొక్కల వాడకం వల్ల మొక్కలో రోగనిరోధక శక్తి పెరిగి, వాతావరణ మార్పులను తట్టుకుంటుంది.

4 / 5
ఎలా ఉపయోగించాలి?: నిమ్మ తొక్కలను నేరుగా కుండీలో వేయకుండా, వాటిని ఎండబెట్టి పొడి చేసి మట్టిలో కలపాలి. లేదా నిమ్మ తొక్కలను రెండు రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తులసి మొక్కకు పోయాలి. ఇలా నెలకు రెండుసార్లు చేయడం వల్ల మీ ఇంట్లోని తులసి కోట ఎప్పుడూ పచ్చని ఆకులతో కళకళలాడుతుంది.

5 / 5
Follow Us
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్

అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..

గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..

వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..

గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..

ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!

ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి